మాజీ భార్యను పెళ్లాడనున్న హీరో!

Submitted by arun on Thu, 01/18/2018 - 17:01
HrithikRoshanSussanneKhan

భార్యతో విడిపోయిన ఓ స్టార్ హీరో మళ్లీ పెళ్లికి సిద్ధమవుతున్నాడు. అయితే వేరొక మహిళను పెళ్లాడటం లేదులెండి. తన భార్యనే మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నాడని సినీ వర్గాల్లో టాక్. బాలీవుడ్‌ నటుడు హృతిక్‌ రోషన్‌.. భార్య సూసాన్నే ఖాన్‌తో విడిపోయిన సంగతి తెలిసిందే. వీరికి ఇద్దరు మగపిల్లలు. వారి కోసమే ఇద్దరూ అప్పుడప్పుడూ పార్టీలు, విహారయాత్రల్లో కలుస్తుంటారు. అయితే..వీరిద్దరి మధ్య ఇప్పుడు ఎలాంటి మనస్పర్థలు లేవని ఇద్దరూ కలిసిపోవాలనుకుంటున్నారని బాలీవుడ్‌ వర్గాల సమాచారం. ఇందుకోసం హృతిక్‌..సుసాన్నేను మరోసారి వివాహం చేసుకోవాలనుకుంటున్నాడట. అదీకాకుండా ఇటీవల హృతిక్‌ తన పుట్టినరోజు జరుపుకున్నాడు. ఈ సందర్భంగా సుసాన్నే తన మాజీ భర్తకు విషెస్‌ చెప్తూ..‘ఎప్పటికీ నా జీవితంలో నువ్వే సన్‌షైన్‌. నువ్వెప్పుడూ నవ్వుతూనే ఉండాలి.’ అని ట్వీట్‌ చేస్తూ హృతిక్‌తో కలిసి దిగిన ఫొటోను పోస్ట్‌ చేసింది. హృతిక్‌ ఏర్పాటు చేసిన బర్త్‌డే పార్టీకి కూడా వెళ్లింది. కంగనా విషయంలో తన మాజీ భర్తకు సపోర్ట్ ఇవ్వడం లాంటివి చూస్తే వీరిద్దరూ ఒక్కటవుతారన్న సంకేతం కనిపిస్తోందని టాక్. ఇవన్నీ వీరిద్దరూ కలవడానికి సంకేతాలని బాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి.
 

English Title
Hrithik Roshan and ex-wife Sussanne Khan planning to get back together?

MORE FROM AUTHOR

RELATED ARTICLES