పాక్ లో దావూద్..టచ్ చేయ‌డం భార‌త్ వ‌ల్ల సాధ్యం కాదంట‌

Submitted by lakshman on Wed, 03/14/2018 - 01:25
Mafia don Dawood Ibrahim

అండర్ వరల్డ్ డాన్, భారత్ మోస్ట్ వాంటెడ్ దావుద్ ఇబ్రహీం గుట్టురట్టుయింది. అతను ఎక్కడ తలదాచుకున్నాడో తేలిపోయింది. అతని ఆప్తమిత్రుడు తక్లా ఇచ్చిన సమాచారం ప్రకారం అతను పాక్ లోనే తలదాచుకున్నట్లు మరోసారి రుజువైంది. వివరాల్లోకి వెళ్లినట్లయితే అండర్ వరల్డ్ డాన్ దావుద్ కోసం భారత్ పోలీసులు దశాబ్దాల పాటు వేట కొనసాగిస్తున్న విషయం తెలిసింది. ఈ క్రమంలో ఇటీవలే అతని ఆప్తమిత్రుడైన  ఫరూక్ తక్లాను ముంబై పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అతన్ని విచారించిన  సీబీఐ ..దావుద్ కు సంబంధించిన కీలక సమాచారాన్ని ఫరూక్ తక్లా నుంచి రాబట్టింది.

ఫరూక్ తక్లా  సమాచారం ఇచ్చిన సమాచారం ప్రకారం దావుద్ కు పాక్ ప్రభుత్వం సకల సౌకర్యాలతో కూడిన వీవీఐపీ హోదా తేలింది.  అతని రక్షణ బాధ్యతలు పాక్ సైన్యమే తీసుకున్నట్లు తేలింది. దావుద్, అతని కుటుంబ సభ్యులు ప్రస్తుతం కరాచీలోని క్లిఫ్టన్ ప్రాంతంలో తల దాచుకున్నట్టు తెలిసింది. అతను ఉంటున్న బంగ్లాలో పాక్ రేంజర్లు అతడికి కట్టుదిట్టమైన భద్రత కల్పించారట.

దావుద్ కోసం వ్యూహాత్మక స్థావరం
భారత్ నుంచి ఒత్తిడి వచ్చినప్పుడల్లా దావుద్ ను రహస్య ప్రాంతానికి తరలిస్తుందని తేలిసింది.  అత్యంత వ్యూహాత్మక ప్రాంతమైన ‘అండా గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్‌’లో దావుద్ కు సురక్షిత స్థావరం ఉండడం గమనార్హం.
 
కోరినప్పుడల్లా దూబాయ్‌కి
దావూద్ ఇబ్రహీం కోరినప్పుడల్లా  పాక్ సర్కార్ ఆయన్ను దుబాయ్ చేరుస్తున్నట్టు తక్లా వెల్లడించాడు. ఒకానొక సందర్భంలో దావూద్ దూబాయ్ వచ్చినప్పుడు తాను కూడా రిసీవ్ చేసుకున్నట్టు తక్లా పేర్కొన్నాడు. దావూద్‌ను పలు ప్రాంతాలకు స్వయంగా తానే తిప్పినట్టు తక్లా వివరించాడు. దావూద్ దుబాయ్ వచ్చినప్పుడల్లా అతడి కార్లను ఫరూక్ తక్లానే నడిపేవాడట. దావూద్‌ను తిరిగి తీసుకురావడం భారత అధికారులకు సాధ్యం కాదని ఈ సందర్భంగా తక్లా సీబీఐ ముందు పేర్కొనడం గమనార్హం.

English Title
How Pakistan shelters Dawood Ibrahim, Farooq Takla

MORE FROM AUTHOR

RELATED ARTICLES