శరీరం అందంగా కనిపించాలా.. అయితే ఇలా..

Submitted by nanireddy on Thu, 10/04/2018 - 18:56
how to improve skin glowing

అందంగా కనిపించాలని ప్రతిఒక్కరికి ఉటుంది. అందుకోసం ఏవేవో క్రీములు వాడతారు. కానీ వాటికంటే ముక్యంగా అందమైన శరీరానికి కావలసింది అనుకూలమైన డైట్ అని వైద్యనిపుణులు అంటున్నారు. ఎవరికైనా కూడా గ్లోయింగ్ స్కిన్ కావాలి అనుకుంటే ముందుగా చెయ్యాల్సిన పని వాటర్ ఎక్కువగా త్రాగడం. అది కూడా రోజుకు 8 నుంచి 12 గ్లాసుల వరకు తీసుకోవాలి. ఎవరైతే బాడీకి తగినంత వాటర్ తీసుకుంటారో వారి స్కిన్ చాలా సాఫ్ట్ గా ఉంటుంది. నీరు తరువాత శరీరానికి కావలసింది ఫ్రెష్ ఫ్రూట్స్ మరియు వెజిటబుల్. ముక్యంగా సిట్రస్ ఫ్రూట్స్.. నిమ్మ , దానిమ్మ అలాగే యాపిల్ ఇక వెజిటబుల్ లో అయితే కీరా, క్యారెట్ లాంటివి తీసుకుంటే శరీరానికి అవసరమైన బి కాంప్లెక్స్ అందుతాయి. అలానే కాకుండా విటమిన్ సి కూడా లభిస్తుంది. వీటితోపాటు రోజుకు రెండు నుంచి మూడు బాదం పప్పులు తింటే విటమిన్ E కూడా లభిస్తుంది. ఎప్పుడైతే శరీరంలో విటమిన్ సి,ఈ తోపాటు బి కాంప్లెక్స్ సరైన పద్దతిలో వుంటాయో వారి స్కిన్ చాలా గ్లోయింగ్ గా ఉంటుంది. అలాగే మజ్జిగ, పెరుగు లాంటివి తింటే కూడా శరీరంలో అందమైన మార్పులు వస్తాయని నిపుణులు అంటున్నారు. స్కిన్ బాగా అందంగా కనపడాలి అంటే రోజుకు సరిపడా వాటర్ త్రాగడమే కాక ఫ్రెష్ ఫ్రూట్స్ మరియు వెజిటబుల్ అలాగే పెరుగు, మజ్జిగా తీసుకుంటే మంచిదని వారు సలహా ఇస్తున్నారు.

English Title
how to improve skin glowing

MORE FROM AUTHOR

RELATED ARTICLES