పాన్ కార్డ్ ప‌నిచేస్తుందా..? లేదా..? అని తెలుసుకోవాలంటే

Submitted by arun on Sun, 01/07/2018 - 17:44

న‌కిలీ పాన్ కార్డ్ ల‌ను గుర్తించేలా కేంద్రంప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటుంది. ఇందులో భాగంగా సంబంధిత పాన్ కార్డ్ ల‌ను మార్చి 31,2018లోగా ఆధార్ తో అనుసంధానం చేయాల‌ని సూచించింది. మ‌న పాన్ కార్డ్ లు ఒరిజ‌నల్ లేదా డూప్లికేట్ అనేది  సంబంధిత అధికారులు కంప్యూట‌ర్ల ద్వారా చెక్ చేస్తారు. ఆ స‌మ‌యంలో పాన్ కార్డ్ లో ఏ చిన్న‌త‌ప్పు దొర్లినా న‌కిలీ పాన్ కార్డ్ లా ప‌రిగ‌ణిస్తారు. అయితే మ‌న పాన్ కార్డ్ పనిచేస్తుందా లేదా అని తెలుసుకోవాలంటే . ఈ డిజి లేదా అని చెక్ చేసుకోవాలంటే కొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి.

ముందుగా మ‌న పాన్ కార్డ్ ల‌ను  ఆదాయపు పన్ను శాఖ ఈ ఫైలింగ్‌ వెబ్‌సైటు https:///incometaxindiaefiling.gov.in లో కి వెళ్లి Know Your PAN అనే బటన్‌ను క్లిక్ చేయాలి. అక్క‌డ పాన్ కార్డ్ క‌లిగిన వ్య‌క్తి స‌మాచారాన్ని ఇవ్వాలి. అనంత‌రం ఆ వెబ్ సైట్ నుంచి మ‌న‌కు ఒక ఓటీపీ వ‌స్తుంది. ఆ ఓటీపీని ఆదాయ‌పు ప‌న్ను శాఖ వెబ్ సైట్ లో పొందుప‌రిస్తే మ‌ని పాన్ కార్డ్ ప‌నిచేస్తుందా లేదా అని తెలుసుకోవ‌చ్చు. ప‌నిచేస్తే ప‌ర్వాలేదు.  బ్లాక్ అని వ‌స్తే ఆదాయపు పన్ను శాఖ అసెసింగ్‌ ఆఫీసర్‌ (ఏఓ)కు లేఖ రాయాలి. ఆ లేఖ రాస్తూ మ‌న పాన్ కార్డ్ కు సంబంధించిన ప‌త్రాలు ఉంటే వాటిని  జ‌త‌చేయాలి. అనంత‌రం వీటిని ప‌రీక్షించి  అన్నీ సవ్యంగానే ఉన్నాయని ఆదాయపు పన్ను శాఖ ధ్రువీకరించుకుంటే.. 10-15 రోజుల్లో మీ పాన్‌ తిరిగి చెల్లుబాటులోకి వస్తుంది.
 

Tags
English Title
How to check pan card is working or not

MORE FROM AUTHOR

RELATED ARTICLES