రాంగ్‌ రూట్‌... బ్రెయిన్‌ డెడ్‌

Submitted by arun on Wed, 07/11/2018 - 10:59

రోడ్లపై ఆదరాబాదరాగా తొందరతొందరగా ఎలా పడితే అలా బైక్‌లు డ్రైవ్ చేసే వారందరికీ ఇదో హెచ్చరిక. ఈ యాక్సిడెంట్ చూసిన తర్వాతైనా కాస్త మారండి. కాస్త కాదు మొత్తానికే మారండి. ఇదెక్కడో జరిగింది కాదు. మన హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని బహదూర్‌పుర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అందుకే.. ఇంతలా చెప్తున్నాం. 

 బైక్‌పై ఉన్న వ్యక్తి ఎంత నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేశాడో. ఈ యాక్సిడెంట్‌లో అతను 3 జాగ్రత్తలు పాటించలేదు. మర్చిపోయాడో తెలియదు లేక ఎవరడుగుతారులే అనుకున్నాడో ఏమో గానీ చివరికి ఇలా ప్రమాదానికి గురయ్యాడు. మొదటగా అతను హెల్మెట్ పెట్టుకోలేదు. రెండోది రాంగ్‌రూట్‌లో డ్రైవ్ చేశాడు. మూడోది సెల్‌ఫోన్ డ్రైవింగ్. ఇలా ఒకేసారి 3 తప్పులు చేసి చివరకు యాక్సిడెంట్‌కు గురయ్యాడు. ఈ ప్రమాదంలో రాంగ్ రూట్‌లో వెళ్లిన వ్యక్తికి బ్రెయిన్ డెడ్ అయ్యింది. అందుకే మిమ్మల్ని ఇంతలా హెచ్చరిస్తోంది. కనీసం హెల్మెట్ పెట్టుకున్నా అతని పరిస్థితి మరోలా ఉండేది. కానీ మనం చేసే చిన్న చిన్న పొరపాట్లే చివరికి విషాదాన్ని మిగులుస్తాయ్. 

పోలీసులు హెల్మెట్ పెట్టుకోమంటారు. సెల్‌ఫోన్ డ్రైవింగ్, డ్రంకెన్ డ్రైవ్ వద్దంటారు. రాంగ్‌రూట్‌లో వెళ్లొద్దని చెప్తారు. కానీ కొందరు వినరు. ఎంత చెప్పినా మారరు. ఏం చేసినా అర్థం చేసుకోరు. పద్ధతిగా చెప్పినప్పుడు వినకపోతే  ప్రమాదాల బారిన పడాల్సి వస్తుంది. అందుకే వినాలి. వాళ్లు చెప్పేది మన ప్రాణాలు రిస్క్‌లో పడొద్దనే. అందుకే ఇది చూసైనా మారమనేది.

English Title
How Cell Phone Driving Leads To a Major Mishap in Hyderabad

MORE FROM AUTHOR

RELATED ARTICLES