గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఇలా చేస్తే సరి..

Submitted by nanireddy on Tue, 09/18/2018 - 18:08
hot-water-baths-are-great-your-heart

గుప్పెండంత గుండె ఆరోగ్యంగా ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉండి మనుగడ సాగిస్తాడు.  నిరంతరం పనిచేసే గుండె ఓ క్షణం అలసి పోయిందంటే ఊపిరి ఆగిపోతుంది. మరి అలాంటి గుండెని పదిలంగా కాపాడుకోవాలంటే కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు కూడా పాటించాలి. రోజు మంచి ఆహారంతో పాటు, వ్యాయామం ఖచ్చితంగా ఉండాలి. వీటి తోపాటు రోజు  గోరు వెచ్చటి నీటితో స్నానం చేస్తే.. మంచిదని కొందరు పరిశోధకులు తమ పరిశోధనలో తేల్చారు.  రెండుపూటలా గోరు వెచ్చటి నీరు శరీరం మీద పడితే శారీరక అలసటతో పాటు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. గుండెకు రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది. రక్తపోటు (బీపీ) అదుపులో ఉంటుంది.జపాన్ పరిశోధకులు సుమారు ఎనిమిదివందలమంది స్త్రీ పురుషుల మీద అధ్యయనం చేసి ఈ విషయాన్ని తేల్చారు. స్నానానికి ఉపయోగించే నీరు  గోరువెచ్చనీళ్లయితే గుండె పనితీరు మెరుగ్గా ఉంటుందని చెబుతున్నారు. కనుక రోజు ఒకసారిగోరు వెచ్చని నీటితో స్థానమాచరిస్తే  గుప్పెండంత గుండె భద్రంగా ఉంటుందన్నమాట.

English Title
hot-water-baths-are-great-your-heart

MORE FROM AUTHOR

RELATED ARTICLES