నీరవ్‌ మోడీ అరెస్ట్‌కు రంగంసిద్ధం

Submitted by arun on Mon, 04/09/2018 - 16:15
Nirav Modi

బ్యాంకులకు 13వేల కోట్ల రూపాయలు కుచ్చుటోపీ పెట్టి విదేశాలకు పారిపోయిన నీరవ్‌మోడీ అరెస్ట్‌కు రంగంసిద్ధమైంది. అసలు నీరవ్‌ మోడీ ఎక్కడున్నాడో తెలిసింది. హాంకాంగ్‌లో నీరవ్‌ ఉన్నట్లు చైనా ధృవీకరించింది. దాంతో నీరవ్‌ను అరెస్ట్‌ చేయాలంటూ హాంకాంగ్‌ పోలీసులను భారత్‌ కోరింది. దాంతో నీరవ్‌ను అరెస్ట్‌ చేసి భారత్‌కు అప్పగించే అవకాశముంది. ఇక రెండ్రోజుల క్రితమే నీరవ్‌మోడీపై సీబీఐ నాన్‌బెయిలబుల్‌ అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసింది. 

English Title
Hong Kong can take decision on Nirav Modi’s arrest: China

MORE FROM AUTHOR

RELATED ARTICLES