ముందస్తుకు సిద్దమైన కేసీఆర్ కి కేంద్ర హోంశాఖ నిర్ణయం షాక్ నిస్తుందా?

x
Highlights

తెలుగు రాష్ట్రాల్లో శాసనసభ నియోజకవర్గాల అంశం మళ్ళీ తెరపైకి వచ్చింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో శాసనసభ రద్దైన తర్వాత కేంద్రం హోం శాఖ దీని పై కసరత్తు...

తెలుగు రాష్ట్రాల్లో శాసనసభ నియోజకవర్గాల అంశం మళ్ళీ తెరపైకి వచ్చింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో శాసనసభ రద్దైన తర్వాత కేంద్రం హోం శాఖ దీని పై కసరత్తు ప్రారంభిస్తుండడంతో రాష్ట్రంలో రాజకీయ వేడి మొదలైంది. 2018 లోనే ఎన్నికలకు వెళ్ళాలని ముందస్తు గా అసేంభ్లీని రద్దు చేసుకున్న ప్రభుత్వానికి ఇది మింగుడుపడని అంశంగా పరిశీలకులు పెర్కోంటున్నారు .అయితే నియోజకవర్గాల పునర్విభజన పై తమకెటువంటి సమాచారం లేదని రాష్ట్ర ఎన్నికల కమిషన్ రజత్ కుమార్ స్పష్టం చేశారు.

9 నెలల పదవి కాలం ఉండగానే అసేంభ్లీని రద్దు చేసుకున ముందస్తుకు సిద్దమైన కేసిఆర్ కి కేంద్ర హోం శాఖ నిర్ణయం షాక్ నిస్తుందా అనే అంశం ఇప్పుడు సచివాలయంలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ శీతకాల పార్లమెంట్ సమావేశాల్లోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్ర విభజన ఛట్టం ప్రకారం శాసనసభ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని తీసుకుంటున్న నిర్ణయం సాధ్యామా అన్న కోణంలో ప్రభుత్వ వర్గాలు ఆరా తీస్తున్నాయి.

అయితే ఇప్పటికిప్పుడు కేంద్రం దీని పై నిర్ణయం తీసుకునేంతా పరిస్థితి ఉంటుందా అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఎన్నికల కమిషన్ ప్రధాన అధికారులు చర్చిస్తున్నారు. తెలంగాణలో ఎన్నికల నిర్వహణకోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్న క్రమంలో ఢిల్లీ పరిణామాలు ఇక్కడి అధికారులను సంశయంలోకి నెట్టాయి. కేంద్రం హోంశాఖ ఎటువంటి నిర్ణయం తీసుకున్నప్పటికి కేంద్ర ఎన్నికల సంఘం నుంచే మాకు సమాచారం రావాల్సి ఉంటుందని కానీ ఇప్పటి వరకు పునర్విభజన పై మమ్మల్ని సీఈసి ఎటువంటి వివరాలు కోరలేదని రాష్ట్ర ఎన్నికల కార్యాలయ అధికారులు చెబుతున్నారు.

రాష్ట్రంలో ఓటరు జాబితా కి కసరత్తు ఒకవైపు, వీ వీ ఫ్యాట్స్, ఈవిఎం పై శిక్షణ మరో వైపు జరగుతున్నది. ఇదే సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం సైతం రాష్ట్రంలో పర్యటించింది. మరో మారు కూడా రాస్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించనుంది. ఇలా నవబంర్ లో ఎన్నికలు జరిగేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు జరుగుతుంటే..ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన అంశం చర్చకు రావాడం చర్చనీయంశం అయ్యంది. సచివాలయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ తో తన ఛాంబర్ లో ప్రత్యేకంగా సీఎస్ సమావేశం కావడం కూడా ఈ పరిణామాల పట్ల ఆసక్తిని రేకేత్తిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories