శ్రీదేవి మృతికి సంతాపంగా హోలీ సంబ‌రాలు ర‌ద్దు

Submitted by arun on Wed, 02/28/2018 - 13:04
Sridevi

ప్రముఖ నటి శ్రీదేవిని కడసారి చూసేందుకు అభిమానులు ముంబయికి భారీగా తరలివస్తున్నారు. సినీ ప్రముఖులు, నేతలు ఆమె పార్థివదేహానికి నివాళులు అర్పిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఆమె అభిమానులు కన్నీటిసంద్రంలో మునిగారు. పలుచోట్ల అభిమానులు సంతాప సూచకంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శ్రీదేవి మరణంతో ఆమె నివాసముంటున్న గ్రీన్ ఎకర్స్ సొసైటీ ప్రాంగణంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. శ్రీదేవి మృతి తీవ్రంగా కలచి వేసిందంటూ అక్కడి నివాసితులు కన్నీరు మున్నీరవుతున్నారు. తాజాగా ఆమె పార్దీవ దేహానికి గౌరవ సూచకంగా తామంతా రాబోయే హోలీ వేడుకలను రద్దు చేసుకుంటున్నామని గ్రీన్ ఎకర్స్ సొసైటీ సభ్యులు ప్రకటించారు. మార్చి 2న వస్తున్న హోలీ పండుగను జరుపుకోమని, ఆ రోజు రంగుల జోరు, రెయిన్ డాన్స్, మ్యూజిక్‌తో పాటు ప్రతీ ఏడాది నిర్వహించే కమ్మూనిటీ లంచ్ కూడా రద్దు చేస్తున్నామని తెలుపుతూ ప్రకటన ఇచ్చారు.

English Title
holi function cancelled

MORE FROM AUTHOR

RELATED ARTICLES