హాకీ ప్రపంచకప్‌లో బాలీవుడ్ స్టార్స్..

Submitted by chandram on Tue, 11/27/2018 - 14:24
hockey

హాకీ ప్రపంచకప్ ఆరంభోత్సవ కార్యక్రమంలో బాలీవుడ్ సూపర్‌స్టార్లు దర్శనఇవ్వనున్నారు. షారుఖ్ ఖాన్, మాధురి దీక్షిత్, సల్మాన్ ఖాన్ పాల్గోననున్నారు. భువనేశ్వర్‌ కళింగ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా మంగళవారం అట్టహాసంగా జరగనున్న ఓపెనింగ్ సెర్మనీలో బాలీవుడ్ తారలు తమ డ్యాన్స్‌లతో, సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేయనున్నారు. నటీ దీక్షిత్1,000 మంది కళాకారులతో కలిసి ప్రత్యేక ప్రదర్శన చేయనున్నారని స్టేడియం బృందం వెల్లడించారు. రెండు ప్రాంతాల్లో జరిగే ఈవెంట్లలో మ్యూజిక్ మ్యాస్ట్రో ఏఆర్ రెహమాన్ సంగీత కచేరి చేయనున్నారు. కటక్‌లో జరిగే రెండో ఓపెనింగ్ సెర్మనీలో సల్మాన్ ఖాన్ పాల్గోననున్నారు. నవంబర్ 28న జరిగే గ్రూప్ ప్రారంభమ్యాచ్ లో సౌతాఫ్రికాతో భారత్ ఢీ కొనబోతోంది. కళింగ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా రేపటి నుంచి రెండువారాలపాటు సాగే ఈ గ్రూప్ లీగ్ కమ్ నాకౌట్ టోర్నీలో ఆతిథ్య భారత్ 5వ ర్యాంక్ జట్టుగా పతకం వేటకు దిగుతోంది. 

English Title
Hockey World Cup Opening Ceremony- Shah Rukh Khan and Madhuri Dixit to dazzle

MORE FROM AUTHOR

RELATED ARTICLES