హైదరాబాద్‌లో శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌

x
Highlights

హైదరాబాద్‌లో నకిలీ డాక్టర్ భాగోతం హెచ్‌ఎం టీవి స్టింగ్ ఆపరేషన్ ఆపరేషన్‌లో బట్టబయలైంది. డాక్టర్‌లకు మంచి సంపాదనతో పాటు గౌరవ హోదా ఉండటంతో శంకర్‌ దాదా...

హైదరాబాద్‌లో నకిలీ డాక్టర్ భాగోతం హెచ్‌ఎం టీవి స్టింగ్ ఆపరేషన్ ఆపరేషన్‌లో బట్టబయలైంది. డాక్టర్‌లకు మంచి సంపాదనతో పాటు గౌరవ హోదా ఉండటంతో శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌ టైప్ మాయగాళ్ల దృష్టి వైద్య వృత్తిపై పడింది. ఓ కేటుగాడు ఏకంగా సీనియర్ మెడికల్ ప్రాక్టిషనర్ అవతారమెత్తాడు. నకిలీ వైద్యంతో రోగుల సొమ్ము కొల్లగొట్టడమే కాదు అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాడు.

ఈ నెల పదో తేదిన దిల్‌సుఖ్‌నగర్‌లో శివ శంకర్ అనే ఓ యువకుడు బైక్‌పై వెళ్తూ కిందపడ్డాడు. చేతికి చిన్న గాయమైంది. వెంటనే సమీపంలోని శ్రీ బాలాజీ క్లినిక్ వెళ్ళాడు. ఆ యువకుడికి వైద్యం పేరుతో గంటపాటు డ్రామా చేశాడు నకిలీ డాక్టర్ వెంకటేశ్వర్లు. చేయి విరిగింది అంటూ ఎక్స్‌రే తీసి, పీ ఓ పీ చేయాలి అంటూ ఆ యువకుడిని భయాందోళనకు గురి చేశాడు. తన చేయి ఏమైపోతుందో అనే భయంతో డాక్టర్ చెప్పినట్లు వైద్యం చేయించుకున్నాడు శివశంకర్.

నకిలీ డాక్టర్ వచ్చిరాని వైద్యంతో ఆ యుకుడికి రిస్ట్ జాయింట్ బాగా చిట్లి పోయింది. కొద్దిగా డబ్బులు ఎక్కువ ఖర్చుఅవుతాయంటూ రిస్ట్ జాయింట్‌కి బలంగా దెబ్బతగిలింది అని ఎక్స్ రే తీసి ప్రిస్క్రిప్షన్ లో మాత్రం రేడియల్ హెడ్ ఫ్యాక్చర్ అయ్యింది రాశాడు. దెబ్బ తగిలిన చోటతో పాటు చేయి మొత్తం బ్యాండేజ్ వేశాడు . దీంతో యువకుడి చేతికి రక్త ప్రసరణ వ్యవస్థ ఆగిపోయింది. ఒక్కరోజులో చేయి వాపు రావడంతో పాటు తీవ్ర నొప్పి వచ్చింది. ఏమి చేయాలో తెలియక బాధితుడు స్నేహితుడు సాయంతో ఉస్మానియా ఆస్పత్రికి వెళ్లాడు.

ఉస్మానియా ఆసుపత్రిలో శివశంకర్ కు ట్రీట్ మెంట్ చేసిన అర్థోపెడిక్ డాక్టర్ శేఖర్ విస్తుపోయాడు. శివశంకర్ చేతికి తగిలిన గాయానికి నకిలీ డాక్టర్ వెంకటేశ్వర్లు చేసిన వైద్యానికి సంబంధంలేదని గుర్తించారు. రిస్ట్ జాయింట్ సంబంధించి ఎక్స్‌రేకి, ప్రిస్క్రిప్షన్ లో రాసిన రేడియల్ హెడ్ ఫ్యాక్చర్ కి సంబంధం లేదు అని తేల్చారు. ఇలాంటి కేసుల్లో రెండు మూడు రోజులు గమనించకుండ బ్యాండ్జ్‌తో అలాగే ఉంటే చేయి తీసేసే ప్రమాదం ఉంటుందని డాక్టర్ శేఖర్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నకిలీ డాక్టర్స్ వైద్యం వికటించి రోజూ నాలుగైదు మంది ఉస్మానియా ఆసుపత్రి వస్తారని చెబుతున్నారు. నకిలీ డాక్టర్ వెంకటేశ్వర్ వైద్యంపై శివశంకర్ ఫ్రెండ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

శ్రీ బాలాజీ క్లినిక్‌లో నకిలీ డాక్టర్ వెంకటేశ్వర్లు లీలలు కొనసాగుతున్నాయి. అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ , వైద్యం పేరుతో భయాందోళనకు గురి చేసి అందిన కాడికి డబ్బులు వసూలు చేస్తున్నట్లు hmtv స్టింగ్ ఆపరేషన్ లో వెల్లడైంది. ఎంబీబీఎస్ పట్టా వుందా లేదా, క్లినిక్ నడపడానికి కావాల్సిన అర్హతలు ఉన్నాయా? అసలు ఇలాంటి నకిలీ డాక్టర్ ను పెంచి పోషిస్తుంది ఎవరు ? ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేక పోతుంది ? డైరెక్టర్ మెడికల్ నిద్ర మత్తులో ఉండడానికి కారణం ఏంటి అనేది అంతుబట్టకుండా ఉంది. వెంకటేశ్వర్లు లాంటి నకిలీ వైద్యులు హైదరాబాద్ లో పదుల సంఖ్యలో ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వద్ద సమాచారం ఉన్న చర్యలు తీసుకోవడం లేదు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఫేక్ డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories