ఇక్కడ హెచ్‌ఐవీ బాధితులకు పెళ్లి సంబంధాలు చూడబడును

Submitted by admin on Wed, 12/13/2017 - 13:18

హెచ్ ఐవీ..! ఈ మాట వింటేనే ఒంట్లో వణుకుపుడుతుంది. రెండు నిమిషాల సుఖం కోసం అడ్డదార్లు తొక్కేవారు ఈ మహమ్మారి నుంచి తప్పించుకోవడం చాలా కష్టం. బాధితులే కాదు. జాగ్రత్త లేకపోతే వారి తరతరాలకు వైరస్ లా సోకుతుంది. ఇంటిల్లిపాదిని సర్వనాశనం చేస్తుంది. సమాజంలో సూటిపోటీ మాటలు, పిల్లలకు అవమానాలు, యువకులకు పెళ్లిళ్లు కాకపోవడం లాంటి ఎన్నో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. అయితే అలాంటి వారికోసం ప్రత్యేకంగా ఓ మ్యారేజ్ బ్యూరో నడుపుతున్నాడు ఓ మహానుభావుడు. 

ఎక్కడైనా ఆస్తికి, ఐశ్వర్యానికి తగ్గట్టుగా వధూవరులను వెతికిపెట్టే మ్యారేజీ బ్యూరోలు చాలానే కనిపిస్తుంటాయి. కానీ, హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో హనుమంత్ ప్రసాద్ అనే వ్యక్తి నడుపుతున్న మ్యారేజీ బ్యూరో మాత్రం కాస్త భిన్నం. ఇక్కడ హెచ్‌ఐవీ బాధితులకు మాత్రమే పెళ్లి సంబంధాలు వెతికిపెడతారు. కొంతమంది వ్యాధి గ్రస్తులు పెళ్లి సంబంధాల కోసం వెతుకుతుంటారు. హెచ్‌ఐవీ ఉన్న వారు ఆ వ్యాధిలేని వారి వివాహం చేసుకుంటే ..అలా పిల్లలకు సంక్రమించే అవకాశం ఉంటుంది. కాబట్టి హెచ్ ఐవీ ఉన్న బాధితులు అదే వ్యాధి గ్రస్తుల్ని వివాహం చేసుకుంటే ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. పరస్పరం అండగా ఉంటారు. అలాంటి వారికోసమే  2005లో హెచ్‌ఐవీ మ్యారేజీ బ్యూరోను స్థాపించారు హనుమంత్ ప్రసాద్. అలా 2008లో http://www.hivmarriages.org/వెబ్‌సైట్‌ను మొదలుపెట్టారు. తమ మ్యారేజ్ బ్యూరో ద్వారా హెచ్ ఐవీ బాధితులకు దాదాపు 3,000పెళ్లిళ్లు చేసుకున్నారని.. ఇక్కడ సంబంధాలు చూసిపెట్టడమే కాదు.. హెచ్‌ఐవీ బాధితులకు ధైర్యం చెప్పి భరోసా కల్పించేందుకు కౌన్సెలింగ్ ఇస్తారు. పెళ్లి సంబంధాల కోసం ఇక్కడికి వెళ్లేవారు ముందుగా వాడుతున్న మందుల వివరాలు, ఆధార్ కార్డు సమర్పించాల్సి ఉంటుంది. 

English Title
hiv-marriage-beuro-hyderabad

MORE FROM AUTHOR

RELATED ARTICLES