రాష్ట్ర మాతగా గోవు...హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ తీర్మానం

రాష్ట్ర మాతగా గోవు...హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ తీర్మానం
x
Highlights

ఆవును రాష్ట్ర మాతగా ప్రకటిస్తూ గురువారం హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానించింది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని ఆమోదం...

ఆవును రాష్ట్ర మాతగా ప్రకటిస్తూ గురువారం హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానించింది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని ఆమోదం కోసం కేంద్రానికి పంపించారు. బిజెపి పాలిత ఉత్తరాఖండ్ సెప్టెంబరులో 'రాష్ట్ర మాతా' ప్రకటించాలని డిమాండ్ చేసిన మొట్టమొదటి రాష్ట్రం అయింది. బిజెపి శాసనసభ సభ్యుల మద్దతుతో కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ సింగ్ ఈ తీర్మానాన్ని ఆమోదించారు. ఆవు పాలు పొదుగు ఆగగానే ఆవులను చంపకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కొందరు ఎమ్మెల్యేల కోరారు. సిర్మావూరు జిల్లాలో రూ.1.52 కోట్లతో ఆవుల కోసం ప్రత్యేకంగా అభయారణ్యాన్ని ఏర్పాటు చేసినట్లు పశుసంవర్ధక శాఖ మంత్రి వీరేందర్ కన్వర్ చెప్పారు. కేవలం గోవుల పరిరక్షణకై రూ.17 కోట్లు వెచ్చించామని ఎమ్మెల్యే కిషోరిలాల్ వివరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories