హిజ్రా దారుణహత్య

Submitted by arun on Sun, 12/24/2017 - 11:28

విశాఖలో దారుణం జరిగింది. అనకాపల్లి గాంధీనగర్‌లో హిజ్రా దేవుడమ్మను గుర్తుతెలియని వ్యక్తులు వేకువజామున దారుణంగా హత్యచేశారు. హత్యచేసిన ఆధారాలు దొరకకుండా మృతదేహంపై కట్టెలుపేర్చి కిరోసిన్‌ పోసి నిప్పుపెట్టి కాల్చివేశారు. బంగారు నగల కోసమే హిజ్రా దేవుడమ్మను హతమార్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ఆధారాలకోసం గాలిస్తున్నారు. ఎవరితోనేనా గొడవలు ఉన్నాయా అనే కోణంలో కూడా విచారణ చేస్తున్నారు. 
 

English Title
Hijra Murderd in Anakapalli

MORE FROM AUTHOR

RELATED ARTICLES