విన్నారా? ఈ సారి.. లక్షా 72 వేల కోట్లట..!

విన్నారా? ఈ సారి.. లక్షా 72 వేల కోట్లట..!
x
Highlights

బట్జెట్ ను భారీగా ప్రవేశపెట్టడంలో.. తెలుగు రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి. మొన్నటికి మొన్న.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్షా 91 వేల కోట్ల బడ్జెట్...

బట్జెట్ ను భారీగా ప్రవేశపెట్టడంలో.. తెలుగు రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి. మొన్నటికి మొన్న.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్షా 91 వేల కోట్ల బడ్జెట్ ప్రవేశపెడితే.. ఇప్పుడు ఏపీ కంటే విస్తీర్ణంలో చిన్నదైన తెలంగాణ దాదాపుగా అంతే మొత్తం కేటాయింపులతో పద్దుల చిట్టా సభ ముందుకు తేనున్నట్టు తెలుస్తోంది. గత ఏడాది లక్షా 49 వేల కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టిన తెలంగాణ ప్రభుత్వం.. ఈ సారి ఏకంగా లక్షా 72 వేల కోట్లకు పైనే బడ్జెట్ ప్రవేశపెట్టబోతోందట.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రాబడి వృద్ధి రేటు 15 శాతంగా అంచనా వేస్తున్న సర్కారు.. వచ్చే ఆర్థిక సంవత్సరం రాబడి మరింత పెరగొచ్చని లెక్కగడుతోంది. అందుకే ఇంత భారీ స్థాయిలో పద్దులు సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. అలాగే.. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత.. వాణిజ్య పన్నుల వాటా తగ్గింది. అదే సమయంలో.. ఎక్సైజ్, పెట్రోలియం ఉత్పత్తుల కారణంగా.. ఆదాయం భారీగా పెరిగింది. ఒక్క ఎక్సయిజ్ శాఖ నుంచి రాష్ట్ర ఖజానాకు 20 వేల కోట్ల రూపాయల భారీ మొత్తం జమ అయ్యింది.

ఈ సారి.. మరింత భారీ మొత్తం ఆదాయం వస్తుందన్న అంచనాతో.. సర్కారు తాజా బడ్జెట్ ను రూపొందించింది. వచ్చేది ఎన్నికల ఏడాది కావడం.. ఎన్నికలకు ముందు ప్రస్తుత ప్రభుత్వానికి ఇదే పూర్తి స్థాయి చివరి బడ్జెట్ కావడంతో.. కేటాయింపులు కూడా ప్రాధాన్యత రంగాలకు ఇస్తున్నారట. ముఖ్యంగా.. వ్యవసాయానికే 12 వేల కోట్ల రూపాయలు కేటాయించే అవకాశం ఉందట. అలాగే.. ఇరిగేషన్, విద్యుత్ రంగాలకు కేటాయింపులు పెంచి.. జనం సమస్యలు తీరుస్తామన్న సంకేతాలు పంపించబోతున్నారట.

దీంతో.. ఎన్నికలకు బడ్జెట్ ను కూడా ప్రచారాస్త్రంగా కేసీఆర్ ప్రభుత్వం వాడుకుంటోందా అన్న అనుమానాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories