నిఘా నీడలో కేసీఆర్ మొక్క...చుట్టూ 3 సీసీ కెమెరాలు...

నిఘా నీడలో కేసీఆర్ మొక్క...చుట్టూ 3 సీసీ కెమెరాలు...
x
Highlights

హరితహారం కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా హరితహారం పేరుతో కోట్లాదిగా మొక్కలు నాటుతున్నారు....

హరితహారం కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా హరితహారం పేరుతో కోట్లాదిగా మొక్కలు నాటుతున్నారు. అయితే వాటిపై పర్యవేక్షణ లేకపోవడంతో చాలా మొక్కలు ఎండిపోతున్నాయి. మూడో విడత హరితహారంలో భాగంగా గత ఏడాది జూలై 12వ తేదీన కరీంనగర్‌లోని దిగువ మానేరు జలాశయం వద్ద సీఎం కేసీఆర్ స్వయంగా నాటిన మహాఘని మొక్క ఎండిపోయింది. మోక్క వాడిపోవడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. స్థానికులు, పశువుల నుంచి దానికి ఏ విధమైన నష్టం వాటిల్లకుండా నగరపాలక అధికారులు పటిష్టమైన సంరక్షణ చర్యలు చేపట్టారు. కెసిఆర్ నాటిన మొక్కకు ట్రీ గార్డు ఏర్పాటు చేశారు. మొక్క చుట్టూ 3 సిసి కెమెరాలు ఏర్పాటు చేశారు. పటిష్టమైన సంరక్షణ చర్యలు చేపట్టారు. మొక్కకు సమీపంలోనే తాత్కాలిక గుడారం ఏర్పాటు చేసుకుని పోలీసులు, కార్పోరేషన్ సిబ్బంది మొక్కను పర్యవేక్షిస్తున్నారు. కంటికి రెప్పలా కాపాడుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories