యాదాద్రిలోవ్యభిచారం కేసుపై హైకోర్టులో విచారణ

x
Highlights

యాదాద్రిలోవ్యభిచారం కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. బాలికలకు హార్మోన్‌ ఇంజక్షన్లు ఇవ్వడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంజక్షన్ వాడడం వల్ల...

యాదాద్రిలోవ్యభిచారం కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. బాలికలకు హార్మోన్‌ ఇంజక్షన్లు ఇవ్వడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంజక్షన్ వాడడం వల్ల కలిగే అనర్థాలపై ధర్మానం వివరణ కోరింది. ఆపరేషన్ ముస్కాన్‌లో ఎలాంటి చర్యలు చేపట్టారో వివరాలు తెలపాలని పోలీసులను ఆదేశించింది. యాదాద్రిలో రెస్క్యూ అయిన చిన్నారులకు మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించిన కోర్టు ఎంత మందికి బెయిల్ లభించిందో వివరాలు తెలపాలని కోరింది. తదుపరి విచారణ మంగళవారానికి వాయిదా పడింది.

కోర్టుకి హాజరై యాదాద్రి డీసీపీ రామచంద్ర రెడ్డి ఈ కేసులో రెస్క్యూ చేసిన భాదితులును పునరావాస కేంద్రాలు తరలించామని తెలిపారు. వ్యబిచార ముఠాలో 30 మందిపై కేసులు పెట్టామని 27 కేసుల్లో పీడీ యాక్ట్ లు పెట్టి, జైల్ కి పంపామని చెప్పారు. షీ టీమ్ ఆధ్వర్యంలో వ్యభిచార గృహాలు, ముఠాలపై నిఘా పెట్టామని పోలీస్ అధికారులు కోర్టుకు తెలిపారు. మరోవైపు, కోర్టుకి హాజరై ఉస్మానియా వైద్య బృందం హార్మోన్‌ ఇంజక్షన్లు, రెస్క్యూ అయిన చిన్నారులకు అందుతున్న వైద్యంపై వివరణ ఇచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories