ధర్మపురి సంజయ్‌కి కోర్టులో చుక్కెదురు..

Submitted by arun on Thu, 08/09/2018 - 11:23
sanjay

సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్) కుమారుడు ధర్మపురి సంజయ్‌కి బుధవారం హైకోర్టులో చుక్కెదురైంది. లైంగిక ఆరోపణల నేపథ్యంలో తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని కోరుతూ సంజయ్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణకు స్వీకరించిన హైకోర్టు ఆయన పిటిషన్‌ను కొట్టి వేసింది. కేసు విచారణను తాత్కాలికంగా నిలిపివేయాలన్న వినతిని కూడా తోసిపుచ్చింది. అరెస్ట్ విషయంలో పోలీసులు సీఆర్‌పీసీ 41ఏ సెక్షన్ ప్రకారం నడుచుకోవాలని ఆదేశించింది. నిజామాబాద్‌లోని శాంకరీ నర్సింగ్ కాలేజీకి చెందిన 11 విద్యార్థినులపై సంజయ్ లైంగిక వేధింపులుకు పాల్పడినట్లు కేసు నమోదైంది. తనకు లొంగకపోతే పరీక్షల్లో ఫెయిల్ చేయిస్తారని, పరువు తీయిస్తానని అతడు బెదిరించాడని బాధితులు హోంమంత్రికి, డీజీపీకి ఫిర్యాదు చేశారు. దీంతో డీజీపీ దర్యాప్తుకు ఆదేశించారు. ఈ ఆరోపణల వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆరోపించిన ఆయన తర్వాత కనిపించకుండా పోయారు. అరెస్ట్ నుంచి తప్పించుకోడానికి కోర్టును ఆశ్రయించారు.
 

English Title
high-court-dismisses-quash-petition-ds-son-sanjay

MORE FROM AUTHOR

RELATED ARTICLES