అయేషా మీరా హత్యకేసులో కీలక మలుపు

అయేషా మీరా హత్యకేసులో కీలక మలుపు
x
Highlights

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన అయేషా మీరా హత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. విజయవాడ కోర్టులో కేసు రికార్డులన్నీ ధ్వంసమయ్యాయని తాజాగా...

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన అయేషా మీరా హత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. విజయవాడ కోర్టులో కేసు రికార్డులన్నీ ధ్వంసమయ్యాయని తాజాగా సిట్‌ హైకోర్టుకు తెలిపింది. హైకోర్టులో కేసు నడుస్తున్న సమయంలోనే రికార్డులు ధ్వంసమయ్యాయని పేర్కొంది.

2007 డిసెంబర్ 26న ఉమ్మడి ఆంధ్ర‌ప్రదేశ్‌లోని విజయవాడలో ఆయేషా మీరా హత్యకేసు తీవ్ర సంచలనం సృష్టించింది.. అప్పటి నుంచి ఎన్నో మలుపులు తిరుగుతూ వస్తున్న ఈ కేసులో ఎవరూ ఊహించని మరో ట్విస్ట్ ఎదురైంది... విజయవాడ కోర్టులో ఆయేషా హత్య కేసుకు సంబంధించిన ఫైల్స్ మొత్తం ధ్వంసమయ్యాయని హైకోర్టుకు సిట్ తెలిపింది. ఈ మేరకు హైకోర్టుకు సిట్ ఓ నివేదికను కూడా సమర్పించింది.

ఉమ్మడి హైకోర్టులో కేసు నడుస్తున్నప్పుడే రికార్డులు ధ్వంసమయ్యాయని సిట్‌ అధికారులు ధర్మాసనానికి తెలిపారు. దీనిపై ఆగ్రహించిన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం రికార్టుల ధ్వంసంపై విచారణకు ఆదేశించింది. నాలుగు వారాల్లో నివేదిక సమర్పించాలని రిజిస్టార్‌ జనరల్‌కు ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో పోలీసు విచారణ కంటే సీబీఐ దర్యాప్తే మేలని ధర్మాసనం అభిప్రాయపడింది. దీనిలో భాగంగా సీబీఐని సైతం సుమోటో ప్రతివాదిగా చేర్చించింది. ఇక ఈ కేసులో అసలు దోషిని పట్టుకునేందుకు కేసును పునర్విచారణ చేయాలని హైకోర్టు ఈ ఏడాది జనవరిలో తెలిపింది. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించిన ఫైల్స్ ధ్వంసమయ్యాయని సిట్ తెలపడంతో కేసు ఊహించని మలుపు తిరిగింది.

Show Full Article
Print Article
Next Story
More Stories