నామినేషన్ కు పది రోజుల ముందువరకు కూడా అనుమతి..

Submitted by nanireddy on Thu, 10/11/2018 - 10:41
high-court-allows-ec-to-publish-telangana-voters-list-on-oct-12

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల తుది జాబితా ప్రచురణకు అన్ని అడ్డంకులూ తొలగిపోయాయి. సవరించిన ఓటరు జాబితా ప్రకటనకు హైకోర్టు బుధవారం అనుమతినిచ్చింది. ఈనెల 12న జాబితాను ప్రచురించుకోవచ్చని స్పష్టం చేసింది. వివిధ నియోజకవర్గాల్లో బూత్‌ల వారీగా ఓటర్ల జాబితాను ప్రచురించాలని సూచించింది. అలాగే తప్పుల సవరణకు అవసరమైన చర్యలు చేపట్టాలని వెల్లడించింది. తీర్పు అనంతరం మీడియాతో మాట్లాడారు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రజత్‌కుమార్.. ఈ సందర్బంగా ఈనెల 12న ఓటర్ల తుది జాబితాను ప్రకటిస్తామని ఆయన తెలిపారు. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ అయిన 19వ తేదీకి పది రోజుల ముందు వరకు కూడా ఓటర్ల నమోదుకు దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు. చిరునామా మార్పు, ఇతర మార్పుల కోసం వచ్చే దరఖాస్తులను నామినేషన్ల చివరి గడువు వరకు తీసుకుంటామని రజత్‌కుమార్ తెలిపారు. 

English Title
high-court-allows-ec-to-publish-telangana-voters-list-on-oct-12

MORE FROM AUTHOR

RELATED ARTICLES