వీరిద్దరిలో సపోర్ట్ ఎవరికంటే : నటి వరలక్ష్మి

Submitted by nanireddy on Sun, 11/18/2018 - 09:50
heroine-varalaxmi-talk-about-her-father-and-friend-vishal

ఈ ఏడాది వరుసగా ఆరు చిత్రాల్లో కనిపించి మూడింటిలో అద్భుతమైన నటన కనబర్చిన వరలక్ష్మి.. మొన్నామధ్య బోల్డ్ స్టేట్ మెంట్ ఇచ్చి అబాసుపాలయ్యారు. అయితే ఆ వ్యాఖ్యలు ఏదో సరదాగా వ్యాఖ్యానించినవే అని అభిమానులు అభిప్రాయపడ్డారు. ఒక ఛానల్ ఇంటర్వ్యూ లో ప్రశ్నకు సమాధానంగా వరలక్ష్మి కూడా ఇదే విషయాన్నీ చెప్పారు. ఏ విషయంలోనైనా ధైర్యంగా మాట్లాడటం అమ్మే తనకు నేర్పిందని చెప్పారు.  మా అమ్మే నా ధైర్యం. ఆవిడలో సగం ధైర్యవంతురాలిగా ఉన్నా కూడా నేను చాలా లక్కీ అనే అనుకుంటాను. అని చెప్పారు. అమ్మా నాన్న ఇద్దరూ కూడా తనకు ఇష్టమని.. అంతేకాకుండా స్నేహితుల్లో విశాల్ అత్యంత సన్నిహితుడు అతడు  చిన్నప్పటినుంచి నాకు తెలుసు అన్నారు. అయితే అంత స్నేహం ఉన్నప్పుడు నడిగర సంగం ఎన్నికల్లో విశాల్ కు ఎందుకు సపోర్ట్ చెయ్యలేదని అడిగిన ప్రశ్నకు ఆమె ఈ విషంగా స్పందించారు. 'అప్పుడు ప్రెస్‌ స్టేట్‌మెంట్‌ కూడా ఇచ్చాను. మా నాన్నగారికే నేను సపోర్ట్‌ చేస్తున్నానని. విశాల్‌ ఎప్పటికీ బెస్ట్‌ ఫ్రెండే.  కానీ నేను మా నాన్నగారినే సపోర్ట్‌ చేస్తాను, నాన్నకే ఏ విషయంలోనైనా సపోర్ట్ చేస్తా' అని నిర్మొహమాటంగా వరలక్ష్మి చెప్పింది. 

English Title
heroine-varalaxmi-talk-about-her-father-and-friend-vishal

MORE FROM AUTHOR

RELATED ARTICLES