జయలలిత సమాధి సాక్షిగా విశాల్‌ నామినేషన్‌

Highlights

జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కేనగర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగబోతోంది. డిసెంబర్ 21న ఈ స్థానానికి ఉప ఎన్నిక జరగనుండటంతో తమిళ రాజకీయం వేడెక్కుతోంది....

జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కేనగర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగబోతోంది. డిసెంబర్ 21న ఈ స్థానానికి ఉప ఎన్నిక జరగనుండటంతో తమిళ రాజకీయం వేడెక్కుతోంది. సినీ నటుడు విశాల్ కూడా ఈ స్థానానికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తుండటంతో ప్రజల్లో ఏం జరగబోతోందోనన్న ఉత్కంఠ నెలకొంది. జయలలిత సమాధి వద్ద నివాళులర్పించిన అనంతరం నామినేషన్‌ సెంటర్‌కు వెళ్లిన అతడు స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు పత్రాలు సంబంధిత అధికారులకు అందించాడు.

తనకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆదర్శమని ప్రకటించిన విశాల్‌.. అమ్మ ఆశయాలకు అనుగుణంగా పని చేసేందుకు ఓ అవకాశం ఇవ్వాలని ఆర్కే నగర్‌ ప్రజలను కోరుతున్నాడు. డీఎంకే అభ్యర్థిగా మరుదు గణేశ్, అన్నాడీఎంకే అభ్య ర్థిగా మదుసూదనన్, అన్నాడీఎంకే బహిష్కృత దినకరన్( అన్నాడీ ఎంకే అమ్మ పార్టీ తరపున)‌, బీజేపీ అభ్యర్థి కరు నాగరాజన్ ప్రధాన పార్టీల తరపున అభ్యర్థులుగా పోటీపడుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తమిళనాట క్రేజ్‌ సంపాదించుకున్న మాస్‌ హీరో విశాల్‌ బరిలోకి దిగటంతో పోటీ మరింత రసవత్తరంగా మారనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories