ఎంపీ గల్లా విసిరిన సవాల్ కు సమాధానం చెప్పిన హీరో సుమంత్

Submitted by nanireddy on Fri, 06/08/2018 - 08:14
hero sumanth accepted mp galla jayadev challenge

రెండురోజుల కిందట గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ విసిరిన సవాల్ ను స్వీకరించారు ప్రముఖ టాలీవుడ్ హీరో సుమంత్. #hugAtree’ ఛాలెంజ్‌ పేరుతో ఎంపీ గల్లాజయ్‌‌దేవ్‌ చెట్టును కౌగిలించుకుని, ‘మన జీవితంలో చెట్లు కీలక పాత్ర పోషిస్తాయి. అందుకు వాటికి ఓ వెచ్చటి కౌగిలిని ఇవ్వడం ద్వారా వేడుక చేసుకుందాం. ఈ ఛాలెంజ్‌ను మీరూ తీసుకోండి. అంతేకాకుండా, మరో అయిదుగురికి సవాల్ విసరండి’ అంటూ ఆయన అశోక్‌ గల్లా, సిద్ధార్థ్‌ గల్లా, సుధీర్‌బాబు, సుమంత్‌, రానా దగ్గుబాటిలకు ఈ ఛాలెంజ్‌ను విసిరారు.  తాజాగా ఈ ఛాలెంజ్ ను స్వీకరించారు హీరో సుమంత్. ఈ మేరకు ఓ చెట్టుకు గట్టి కౌగిలి ఇస్తూ ఫోటో తీసే సమాధానం చెప్పాడు.. అనంతరం దీనిని.. అఖిల్‌, నాగచైతన్య, సమంత, సుశాంత్‌, కృతి కర్బందాలకు నామినేట్‌ చేస్తున్నా’ అని అని వారికీ సవాల్ విసిరారు.ఇదిలావుంటే ఇటీవల ఫిట్ నెస్ ఛాలెంజ్ పేరుతో కేంద్రమంత్రి రాజ్యవర్ధన్ సింగ్ విసిరిన సవాలును ప్రధానితోపాటు పలువురు సెలబ్రిటీలు స్వీకరించారు.

English Title
hero sumanth accepted mp galla jayadev challenge

MORE FROM AUTHOR

RELATED ARTICLES