హీరో రాజ్ తరుణ్ తండ్రికి జైలు శిక్ష

Submitted by arun on Sat, 04/21/2018 - 10:12
 Raj Tarun

బ్యాంకులో పని చేస్తూ... నకిలీ బంగారాన్ని కుదువ పెట్టి రుణం పొందిన కేసులో సినీహీరో రాజ్‌తరుణ్‌ తండ్రి నిడమర్తి బసవరాజుకు మూడేళ్ల జైలుశిక్ష విధిస్తూ శుక్రవారం కోర్టు తీర్పునిచ్చింది. రాజ్ తరుణ్ తండ్రి బసవరాజు విశాఖపట్నంలోని వేపగుంటలో నివసిస్తున్నారు. ఆయన సింహాచలం ఎస్‌బీఐ బ్రాంచిలో 2013లో స్పెషల్ అసిస్టెంట్ క్యాషియర్‌గా పనిచేస్తుండేవారు. అదే సమయంలో తన భార్య రాజ్యలక్ష్మితో పాటు అదే ప్రాంతానికి చెందిన ఎంఎస్ఎన్ రాజు, ఎన్. సన్యాసిరాజు, కె.సాంబమూర్తి, ఎన్.వెంకట్రావు పేర్ల మీద నకిలీ బంగారాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టి రూ.9.85లక్షల లోన్ తీసుకున్నారు.
 
తర్వాత కొద్ది రోజులకు బ్యాంకు అధికారుల తనిఖిల్లో నకిలీ బంగారు వస్తువులు బయటపడ్డాయి. బ్యాంకు మేనేజర్ సుబ్రహ్మణ్యం ఫిర్యాదు మేరకు గోపాలపట్నం పోలీసులు విచారణ చేపట్టారు. అనంతరం సీఐ నరసింహారావు దీనిపై ఓ నివేదికను కోర్టుకు అందజేశారు. విచారణ అనంతరం శుక్రవారం తీర్పు వెలువడింది. బసవరాజుకు మూడేళ్ల జైలు, రూ.20వేల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది.
 

English Title
hero rajtarun father sentenced 3 years jail

MORE FROM AUTHOR

RELATED ARTICLES