హీరో ప్రిన్స్ గ్రాండ్ రీ ఎంట్రీ..

Submitted by nanireddy on Thu, 08/09/2018 - 07:32
hero-prince-grand-re-entry

బిగ్ బాస్ షో లో పార్టిసిపేట్ చేసి చాలా రోజులు సినిమాలకు దూరమైన ప్రిన్స్  ఇప్పుడు సరికొత్త సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇస్తున్నాడు. అన్ని భాషల నుంచీ ఎన్నో ప్రేమకథలు వస్తుంటాయి. అందుకే ప్రతి కథనూ కాస్త కొత్తగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటి కొత్తదనం నిండి ఉన్న కథతో మరో ప్రేమకథా చిత్రమ్ ప్రారంభం కాబోతోంది. బిగ్ బాస్ తో తిరుగులేని ఆదరణ తెచ్చుకున్నాడు ప్రిన్స్. ఆ రియాలిటీ షోతో ఎంతోమంది ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా సంపాదించుకున్నాడు. గత కొన్నాళ్లుగా మంచి కథల కోసం వెయిట్ చేస్తోన్న ప్రిన్స్ కు ఈ కథతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ఈ సినిమా కోసం తన బాడీ స్టైల్ మార్చుకున్నాడు. ఈ సినిమాలో నలుగురు హీరోయిన్లు నటిస్తున్నారు. మరో కీలక పాత్రలో ఓ స్టార్ హీరోయిన్ కూడా నటించబోతోంది. ఆ హీరోయిన్ ఎవరనేది ప్రస్తుతానికి సస్పెన్స్. A.సుశాంత్ రెడ్డి మరోసారి తానే నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తోన్న సినిమా ఇది. అతి త్వరలో ప్రారంభం కాబోతోన్న ఈ మూవీ రెగ్యులర్ షూట్ కు వెళుతుంది.

English Title
hero-prince-grand-re-entry

MORE FROM AUTHOR

RELATED ARTICLES