హీరో నాని కారుకు ప్రమాదం

హీరో నాని కారుకు ప్రమాదం
x
Highlights

టాలీవుడ్ హీరో నానికి చెందిన కారుకు ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున జూబ్లీహిల్స్‌ రోడ్ నం.45లో ఈ ఘటన చోటుచేసుకుంది. కారు అదుపు తప్పి...

టాలీవుడ్ హీరో నానికి చెందిన కారుకు ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున జూబ్లీహిల్స్‌ రోడ్ నం.45లో ఈ ఘటన చోటుచేసుకుంది. కారు అదుపు తప్పి అతివేగంగా డివైడర్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కారు డ్రైవర్ శ్రీనివాస్ నిద్ర మత్తులో నడవటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తున్నది. ప్రమాదం సమయంలో కారులో హీరో నాని తండ్రి రాంబాబు ఉన్నారు. ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ప్రస్తుతం కోలుకున్నారు. మిగితా వివరాలు తెలియాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories