పోలీసులకు చిక్కిన జర్నీ చిత్ర నటుడు 'జై'

Submitted by nanireddy on Thu, 06/28/2018 - 07:42
hero-jai-oncemore-cought-traffic-police-violating-traffic-rules-tamil-nadu

జర్నీ చిత్ర నటుడు 'జై' మరోసారి పోలీసులకు చిక్కాడు. 2014 ఏప్రిల్‌ 13న స్థానిక కేకే.నగర్‌ సమీపంలోని కాశి థియేటర్‌ ప్రాంతంలో మద్యం మత్తులో ట్రాఫిక్‌ పోలీస్‌ వాహనాన్నే ఢికొట్టిట్టిన కేసులో నాలుగు రోజుల శిక్ష అనుభవించాడు. అంతేకాదు 2017 సెప్టెంబరు 21న మద్యం తాగి వేగంగా కారు నడుపుతూ అడయారు బ్రిడ్జ్‌ సమీపంలో గొడను ఢీకొట్టాడు. ఈ కేసులో పోలీసులు అతనికి జరిమానా విధించి 6 నెలల పాటు డ్రైవింగ్‌ లైసెన్స్‌ను రద్దు చేయగా.. తాజాగా 'జై'  మరోసారి  పోలీసులకు దొరికిపోయాడు. మంగళవారం రాత్రి నుంగంబాక్కమ్‌ ప్రధానరోడ్డులో అధిక ధ్వనితో సైరన్‌ మోగించుకుంటూ వెళ్లడంతో ఇతర వాహనదారులు భయబ్రాంతులకు గురయ్యారు. దీంతో ట్రాఫిక్‌ పోలీసులు 'జై' కారును వెంబడించి అడ్డుకున్నారు. కారు సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అతడిగి  ధ్వని కాలుష్యానికి కారణమైన వారిపై తీసుకునే చర్యల గురించిన అవగాహన వీడియోను చూపించారు.

English Title
hero-jai-oncemore-cought-traffic-police-violating-traffic-rules-tamil-nadu

MORE FROM AUTHOR

RELATED ARTICLES