మనం.. గూగుల్ గుప్పెట్లో బందీలం

మనం.. గూగుల్ గుప్పెట్లో బందీలం
x
Highlights

5 కోట్ల మంది వ్యక్తిగత సమాచారం ఫేస్‌బుక్ నుంచి లీకైన ఘటన ప్రకంపనలు ఇప్పటికీ ఆగలేదు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఏదో ఒక చోట ఆందోళన రేగుతూనే ఉంది....

5 కోట్ల మంది వ్యక్తిగత సమాచారం ఫేస్‌బుక్ నుంచి లీకైన ఘటన ప్రకంపనలు ఇప్పటికీ ఆగలేదు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఏదో ఒక చోట ఆందోళన రేగుతూనే ఉంది. అయితే మనం నిత్యం వాడుతున్న గూగుల్ తల్లి అంతకంటే డేంజర్.. అని మీకు తెలుసా? మనకు తెలియకుండానే మన సమస్త సమాచారాన్ని దాచిపెట్టుకొనే గూగుల్ గుప్పిట్లో మనం ఎప్పుడో బంధీలమైపోయాం.. మనకు తెలియకుండానే.

ఒక్కమాటలో చెప్పాలంటే గూగుల్ ఒక పద్మవ్యూహం. ఒక్కసారి ఎంటరైతే మన పని ఐపోయినట్టే. మనమేంటి? మన బుద్ధేంటి? ఎప్పుడెలా ఉంటాం? ఎక్కడికెళ్తాం? మన లోపలి మనిషేంటి? ఆంతరంగిక ఆలోచనలేంటి? ఇలా మనకు కూడా సరిగా తెలియని మన సమాచారాన్ని, ప్రతి కదలికనీ గూగుల్ ఒడిసి పట్టి నిక్షిప్తం చేసుకుంటుంది.

ఇంటర్నెట్ సామాజ్యంలో గూగుల్‌కు ముందు, గూగుల్ తర్వాత అనేంతలా మార్చేసింది గూగుల్. ప్రపంచాన్ని ఒక్కటిగా చేసిన ఇంటర్నెట్‌లో గూగుల్‌ది ఏకచత్రాధిపత్యం. ఏ దేశంలో అయినా, ఏ బాషలో అయినా గూగుల్ అనే మాటను వినని, చూడని వాళ్లుండరంటే అతిశయోక్తి ఏమాత్రం కాదు. ప్రపంచంలో కొన్ని కోట్ల మంచి రోజూ గూగుల్ ను వాడుతూ తమ పనులను చేసుకుంటున్నారు. టెక్నాలజీలో కొత్త పుంతలు తొక్కించిన గూగుల్ అంటే కోట్ల మందికి ప్రాణం. గూగుల్ లేకుండా పని జరిగే పరిస్థితి లేదు.

మనిషికుండే ఈ బలహీనతనే అలుసుగా తీసుకొని మన ప్రతి కదలికను గూగుల్ డేగ కన్నుతో పర్యవేక్షిస్తోంది. మనకు సంబంధించిన ప్రతీ అంశాన్ని భద్రపరుస్తున్నట్టు వెల్లడైంది. ఆయా సందర్భాలు, యాప్‌లను ఉపయోగించినపుడు, మనం రోజూ మొబైల్‌లో లేదా కంప్యూటర్‌లో నిర్వహించే కార్యకలాపాలు, ఇలా అన్ని విషయాలు గూగుల్, ఫేస్‌బుక్, యూ ట్యూబ్‌లలో రికార్డవుతున్నట్టు తేలింది.

కాలిఫోర్నియా వీధుల్లో తిరుగుతున్న గూగుల్ స్ట్రీట్ వ్యూ కారును రెండేళ్ల క్రితం రవుల్ డియాజ్ అనే ఒక వ్యక్తి తగలబెట్టేశాడు. సీసీ ఫుటేజీ ఆధారంగా డియాజ్‌ను పట్టుకున్న పోలీసులు.. కారును కాల్చడానికి కారణమేంటో అతడి మాటల్లో విని నిశ్చేష్టులైపోయారు. వ్యక్తిగత వ్యవహారాలపై గూగుల్ నిఘా పెట్టిందని అందుకే గూగుల్ కారును కాల్చేశానని డియాజ్ తన ఆగ్రహాన్ని వెల్లగక్కాడు. వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడంలో గూగుల్ పనితీరుకు ప్రబల నిదర్శనం.. ఈ ఘటన.

మీరు మీ మొబైల్‌ ఫోన్‌ను తెరిచిన ప్రతీసారి మీరెక్కడ ఉన్నారో తెలిసిపోతుంది! మీ ఫోన్లో గూగుల్‌ యాప్‌ను ఉపయోగించడం మొదలుపెట్టిన తొలిరోజు నుంచి ఇప్పటివరకు ఎక్కడెక్కడికి వెళ్లారో తేదీలతో సహా ‘టైమ్‌లైన్‌’లో రికార్డయి ఉంటుంది. గూగుల్‌లో సెర్చ్‌ చేసిన ప్రతీ అంశం.. హిస్టరీ సహా ఫోన్‌ డేటా హిస్టరీని డిలీట్ చేసినా, ఒకవేళ పాతఫోన్‌ మార్చినా, ఆ తర్వాత మరిన్ని ఫోన్లు మార్చినా ఆ సమాచారమంతా కూడా సేవ్‌ అయ్యే ఉంటుంది. యూట్యూబ్‌లో ఏమేమీ వీక్షించారు ? మీరు ఎలాంటి వారు ? ఏ మతానికి చెందినవారు? త్వరలోనే తండ్రి లేదా తల్లి కాబోతున్నారా? యూట్యూబ్‌లో చూసిన వీడియోలు, కంటెంట్‌ హిస్టరీతో పాటు ఈ వివరాలన్నీ కూడా గూగుల్‌ వద్ద నిక్షిప్తమై ఉంటాయి.

ఇలా మీకు సంబంధించిన పూర్తి సమాచారమంతా మీకు తెలియకుండానే గూగుల్‌‌లో గుట్టలు గుట్టలుగా పేరుకుపోతోంది. ఫేస్ బుక్ లీకేజీతో గుండెలు బాదుకుంటున్నావారు ఎన్నో ఏళ్లుగా గూగుల్ చేస్తున్న ఈ నిర్వాకం వింటే మరింత ఆందోళన చెందడం ఖాయం.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories