తల లేక 'పోయిన' బతికేస్తున్న కోడి

Submitted by arun on Fri, 03/30/2018 - 12:29
hen

తల లేకుండా భూమి మీద ఏదైనా జీవి బతకగలుగుతుందా ? అంటే ... నేల మీద కాదు కదా  నింగిలో కూడా సాధ్యం కాదంటారు కదూ .. ? అయితే మీ నిర్ణయం మార్చుకోవాల్సిందే. ఎందుకంటే థాయ్‌లాండ్‌లో ఓ కోడి వారం నుంచి తల లేకుండానే జీవిస్తోంది.  స్ధానికంగా ఉన్న  పశువైద్యురాలు ఈ  కోడిని  సంరక్షిస్తున్నారు.  మెడ కింది నుంచి గొంతులోకి ఆహారం అందిస్తూ కోడి ప్రాణాన్ని నిలబెడుతున్నారు.  ‘తల లేక పోయినా చుట్టుపక్కల జరుగుతున్న విషయాలను ఈ కోడి గుర్తించ కలుగుతోంది. అడుగుల శబ్ధం విన్న వెంటనే రెక్కలు విదిలించి గాలిలోకి ఎగురుతోంది. అయితే కోడి  తల ఎలా తెగిపోయిందో తెలియదని కోడిని సంరక్షిస్తున్న పశు వైద్యురాలు చెబుతున్నారు. గతంలో ఓ కోడి తల లేకుండా 18 నెలలు జీవించిన ఘటన అమెరికాలో జరిగింది .  

English Title
hen without head

MORE FROM AUTHOR

RELATED ARTICLES