కాకినాడ కి హైదరాబాద్ కి జోడి కట్టే సినిమా.. ‘హలో గురు ప్రేమ కోసమే’

కాకినాడ కి హైదరాబాద్ కి జోడి కట్టే సినిమా.. ‘హలో గురు ప్రేమ కోసమే’
x
Highlights

‘హలో గురు ప్రేమ కోసమే’ డైలాగ్స్.. కామెడీ.. సెంటిమెంట్ బాగానే కలిపి హలో చెప్పారు. ముఖ్యంగా కొన్ని డైలాగ్స్.. అధర గొట్టేసాయి... అందులో కొన్ని మీకోసం......

‘హలో గురు ప్రేమ కోసమే’ డైలాగ్స్.. కామెడీ.. సెంటిమెంట్ బాగానే కలిపి హలో చెప్పారు. ముఖ్యంగా కొన్ని డైలాగ్స్.. అధర గొట్టేసాయి... అందులో కొన్ని మీకోసం... ‘స్కూల్ అయినా కాలేజ్ అయినా ఆఫీస్ అయినా జాయిన్ అయిన ఫస్ట్ డే అందరూ చేసే ఫస్ట్ పనేంటో తెల్సా’అమ్మాయిల్లో ఎవరు బాగున్నారని అబ్బాయిలు, అబ్బాయిల్లో ఎవరు బావున్నారని అమ్మాయిలు ఏరుకోవడం”గుండెల్ని టచ్ చేసే .. మరొకటి ‘గుర్తుంచుకోవాలి గుర్తుంచుకోవాలి అనుకునే చదువును మర్చిపోతాం.. కానీ మర్చిపోవాలి మర్చిపోవాలి అనుకునే అమ్మాయిని మాత్రం .. దీనమ్మా! చచ్చేదాకా మర్చిపోలేం’ ఇంకా “పెళ్లైన తరువాత అమ్మాయి లైఫ్ అమ్మ అవ్వడం వల్ల బావుంటుంది. పెళ్లికి ముందు అమ్మాయి లైఫ్ నాన్న ఉండటం వల్ల బావుంటుంది”. అలాగే.. ఒక పాత సామెతని తీసుకొని కొత్త గా చెప్పింది... ‘అబద్ధాలు చెబితే అమ్మాయిలు పుడతారో తెలియదు కాని.. అబద్ధాలు చెబితే అమ్మాయిలు ఖచ్చితంగా పడతారు’ ఇలా డైలాగ్స్.. కామెడీతో నడిపించేసారు.. ఏదో ఒక సినిమా చూడాలని వుంటే.. ఈ సినిమా తప్పక చూడవచ్చు .. హలో చెప్పవచ్చు. వినోదం కోసమే అయితే ఒకే గురు. శ్రీ.కో.

Show Full Article
Print Article
Next Story
More Stories