వారసులకు వెల్ కమ్

x
Highlights

నూటపాతికేళ్ల పార్టీని ఇప్పుడు కొత్తరక్తం ఉరకలెత్తించబోతోందా.? ఇక కాంగ్రెస్ లో యువరక్తమే ఉరకలెత్తిస్తుందా? రాహుల్ ఎంట్రీతో కాంగ్రెస్ రాత మారబోతోందా?...

నూటపాతికేళ్ల పార్టీని ఇప్పుడు కొత్తరక్తం ఉరకలెత్తించబోతోందా.? ఇక కాంగ్రెస్ లో యువరక్తమే ఉరకలెత్తిస్తుందా? రాహుల్ ఎంట్రీతో కాంగ్రెస్ రాత మారబోతోందా? ఇలాంటి అనేక ప్రశ్నలకు రాహుల్ వ్యూహమే సమాధానంగా కనిపిస్తోంది. సీనియర్ల సలహాలు తీసుకుంటూ యువరాజకీయ నేతలకు అవకాశాలు కల్పించే దిశంగా కాంగ్రెస్ కదులుతోంది

సార్వత్రిక ఎన్నికలకు ఏడాది సమయముంది. కానీ రాజకీయ పార్టీలు, నేతలు మాత్రం ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించాయి. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో రాజకీయ ముఖచిత్రమే పూర్తిగా మారబోతోందనే అంచనాలున్నాయి. వారసుల ఎంట్రీతో కొత్తరాజకీయానికి అడుగులు పడుతున్నాయి. కాంగ్రెస్, టీఆర్ఎస్ ముఖ్యంగా ఈరెండు పార్టీల నుంచి రాజకీయ అరంగేట్రానికి వారసులు ఎక్కువగా ఉవ్విళ్లూరుతున్నారు. క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ తమ పొలిటికల్ ఎంట్రీకి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. నియోజక వర్గాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీలో ఆశావహుల లిస్టు చాలా పెద్దదే ఉంది. సీనియర్లు తమ వారసులను పూర్తి స్థాయిలో నియోజకవర్గాల్లో దింపే ప్రయత్నాల్లో ఉన్నారు. మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తీక్ రెడ్డి ఇప్పటికే ఫుల్ టైమ్ పొలిటీషియన్ గా మారారు, రాబోయే రోజుల్లో రాంరెడ్డి దామోదర్ రెడ్డి తనయుడు సర్వోత్తమ్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క కూతురు మల్లు నందిని, గీతారెడ్డి కూతురు మేఘనారెడ్డి రాజకీయ అరంగేట్రానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది.

అధికార టీఆర్ఎస్ లో కొంత మంది కేంద్ర రాజకీయాల్లోకి వెళతారనే ప్రచారం జరుగుతుండంటో రాష్ట్రంలో తమ వారసులను తెరపైకి తెస్తున్నారు. వీరిలో కడియం శ్రీహరి కూతురు కావ్య, రెడ్యానాయక్ తనయుడు రవిచంద్ర, పోచారం శ్రీనివాసరెడ్డి తనయులు భాస్కర్ రెడ్డి వంటివారు ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో కొత్త ముఖాలు, యువత పెద్దఎత్తున కనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొంతమంది తండ్రుల నియోజకవర్గాలపైనే కన్నేస్తే.. మరికొందరు నియోజకవర్గాల పునర్విభజనపై ఆశలు పెట్టుకున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories