మరో 24 గంటలు వర్షాలు..

మరో 24 గంటలు వర్షాలు..
x
Highlights

రానున్న 24 గంటల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ నిపుణులు తెలిపారు. ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర తీరం వెంబడి అల్పపీడన...

రానున్న 24 గంటల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ నిపుణులు తెలిపారు. ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర తీరం వెంబడి అల్పపీడన ద్రోణి ఏర్పడిందన్నారు. అంతేకాకుండా 24 గంటల్లో ఉత్తర బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నదని, అదేప్రాంతంలో 16న మరో అల్పపీడనం ఏర్పడే పరిస్థితులు ఉన్నాయి. ఈ ప్రభావంతో రానున్న 24 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని నిపుణులు అంటున్నారు. ఇక మూడు రోజుల నుంచి తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఖమ్మం, భద్రాద్రి, పెద్దపల్లి, జగిత్యాల, భూపాలపల్లి, కరీంనగర్, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలు తడిసి ముద్దయ్యాయి. అలాగే ఏపీలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. కోస్తాలో 20% ఎక్కువగా, రాయలసీమలో 7% తక్కువగా వర్షపాతం నమోదైంది. కడపలో 53% లోటుతో తీవ్ర వర్షాభావం కొనసాగుతోంది. తుంగభద్ర జలాశయానికి వరద క్రమంగా పెరుగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories