కువైట్‌లో మూడు రోజులుగా భారీ వర్షం

Submitted by arun on Thu, 11/15/2018 - 12:08
Kuwait

కువైట్‌ దేశాన్ని భారీవర్షాలు అతలాకుతలం చేశాయి. మూడు రోజులుగా బారీ వర్షం కురుస్తుండగా, మరో రెండు రోజులు వర్షాలు ఉంటాయని అక్కడి వాతావరణ శాఖ స్పష్టం చేసింది. దీంతో ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టింది. అంతేకాకుండా ఇంట్లో నుండి బయటికి రావొద్దని అని కూడా హెచ్చరికలు జారీ చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఇప్పటికే సహయకచర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం రక్షణ దళాలను రంగంలోకి దించింది. ఎప్పటికప్పుడు ప్రమాద పరిస్థితులు తెలుసుకోనేందుకు టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేసింది. ఎటువంటి విపత్కర పరిస్థితులు సంబంధించిన వెంటనే  టోల్ ప్రీం నంబర్లకు సమాచారం ఇవ్వాలని సూచించింది.  

వర్షం మరో రెండు రోజులు ఉండటంతో కువైట్ లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ వర్షం కారణంగా  పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి పూర్తిగా నీరు చేరుకోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. పలుచోట్ల కార్లు పూర్తిగా మునిగి పోయాయి. వరద నీటిలో కార్లు కొట్టుకొని పోవడంతో పలువురు ప్రాణాలు కోల్పోయారు.  రెండు రోజుల వరకు ఎవరు బయటకు రావద్దని రోడ్లమీద తిరగవద్దని ప్రభుత్వం హెచ్చరించడాన్ని బట్టి చూస్తే అక్కడి పరిస్ధితులు ఎలా ఉన్నాయో అర్ధం చేసుకొవచ్చు. కుండపోత వర్షాల కారణంగా పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. మరికొన్నింటిని దారిమళ్లించారు.

అనుకోని వర్షాల కారణంగా కువైట్ ప్రభుత్వం తీవ్ర సమస్యలను ఎదుర్కొంటోంది. భారీ వర్షాల కారణంగా తలెత్తిన సమస్యలను పరిష్కరించేందుకు తగిన యంత్రాంగం లేకపోవడంతో కువైట్ ప్రభుత్వం ఎన్నడూలేని సమస్యను ఎదుర్కొంటోంది. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్‌ విస్తరించడం కువైట్ ప్రభుత్వానికి మరో తలనొప్పిగామారింది. సమాచారశాఖ ప్రతినిధులు ఎప్పటికప్పుడు కువైట్ టెలివిజన్ ద్వారా తాజా సమాచారాన్ని ప్రజలకు అందిస్తున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలను నమ్మవద్దని ప్రజలకు విజ్నప్తి చేస్తున్నారు.

English Title
Heavy rains in Kuwait

MORE FROM AUTHOR

RELATED ARTICLES