కిడ్నీ స‌మ‌స్య‌ని గుర్తించ‌డం ఎలా

Submitted by lakshman on Wed, 04/11/2018 - 05:45
health tips in telugu for kidney

ప్ర‌పంచం మొత్తంలో కిడ్నీ వ్యాధులు చాలా వేగంగా పెరుగుతున్నాయ‌న్న సంగ‌తి అంద‌రికి తెలిసిందే. కిడ్నీ పాడ‌వుతుంద‌ని తెలిపే ల‌క్ష‌ణాలు బ‌య‌టికి క‌నిపించ‌వు. మ‌నంత‌టమ‌నం కిడ్నీ ఎలా ఉందో తెలుసుకునేందుకు అవ‌స‌ర‌మ‌య్యే ప‌రీక్ష‌ల‌ను చేయించుకుంటేనే కిడ్నీ ఎలా ఉందో తెలుస్తుంది. ఈ కిడ్నీ ప‌రీక్ష‌లు ఎవ‌రు చేయించుకోవాల‌న్న ప్ర‌శ్న అంద‌రికీ వ‌స్తుంది. కిడ్నీ ప‌రీక్ష‌లు ముఖ్యంగా డ‌యాబెటీస్ ఉన్న వారు త‌ప్ప‌ని స‌రిగా ప్ర‌తి ఆరు నెల‌లు..సంవ‌త్స‌రానికి ఒకసారి కిడ్నీకి సంబంధించిన ప‌రీక్ష‌ల‌ను చేయించుకోవాలి.షుగ‌ర్ వ్యాధి ఏ వ‌య‌స్సు వారికి వ‌చ్చినా వ్యాధి వ‌చ్చిన‌ప్పుడు మొట్ట‌మొద‌టిసారిగా కిడ్నీ ప‌రీక్ష‌లు చేయించుకోవాలి..అనంత‌రం ప్ర‌తి ఆరు నెల‌ల‌కి కిడ్నీకి సంబంధించిన ప‌రీక్ష‌ల‌ను చేయించుకోవాలి. ఇలా కాకుండా కొన్ని ల‌క్ష‌ణాల ద్వారా కిడ్నీ స‌మ‌స్య‌ల్ని తెలుసుకోవ‌చ్చు. 
శరీరంలోని మలినాలను బయటకు పంపడంలో కిడ్నీలది కీలకపాత్ర. రక్తాన్ని శుద్ధి చేయడం ద్వారా మూత్రపిండాలు ఒంట్లో పేరుకుపోయిన వ్యర్థాలను ఎప్పటికప్పుడు బయటకు పంపుతాయి. బీపీ, ఎలక్ట్రోలైట్ స్థాయిలను నియంత్రిస్తాయి. కానీ డయాబెటిస్, హై బీపీ లాంటి వ్యాధుల కారణంగా కిడ్నీల పనితీరు మందగిస్తుంది. కిడ్నీల పనితీరు మందగిస్తే.. శరీరం మొత్తానికి ప్రమాదం వాటిల్లుతుంది. కిడ్నీలు పూర్తిగా పాడైతే ప్రాణాలు దక్కకుండా పోతాయి. కాబట్టి ప్రాథమిక దశలోనే కిడ్నీల సమస్యను గుర్తించి సరైన చికిత్స తీసుకోవాలి.
 మూత్రం రంగు మారినా, మూత్రంలో అసాధారణ మార్పులు కనిపించినా కిడ్నీ సమస్య ఉందని భావించాలి. కిడ్నీలు తీవ్రంగా చెడిపోతే రుచి సామర్థ్యం, ఆకలి తగ్గుతుంది. రక్తంలోని వ్యర్థాల కారణంగా వికారం, వాంతులు లాంటి ఇబ్బందులు తలెత్తుతాయి. ఆకలి లేకపోవడంతో బరువు తగ్గుతారు.
కిడ్నీలు సరిగా పనిచేయకపోతే శరీరంలో వ్యర్థాలు పేరుకుపోయి.. ముఖం, కాళ్లు ఉబ్బినట్లుగా కనిపిస్తాయి. కిడ్నీల పనితీరు మందగించడం వల్ల ఎర్ర రక్తకణాల ఉత్పత్తి తగ్గుతుంది. ఆక్సిజన్ స్థాయులు తగ్గడం వల్ల శ్వాస సమస్యలు తలెత్తుతాయి. కిడ్నీలు పాడయినప్పుడు అవి ఉండే భాగంలో నొప్పి ఎక్కువగా ఉంటుంది. కిడ్నీలు చెడిపోయాయి అనడానికి ముందస్తు సూచన ఇది. ఏ విషయంపైనా ఏకాగ్రత ఉంచలేకపోవడం, తలనొప్పి, జ్ఞాపకశక్తి తగ్గడం లాంటి సమస్యలు చుట్టుముడతాయి. కాబట్టి ఏడాదికి ఒకసారి కిడ్నీల పనితీరును పరీక్షించుకోవడం ఉత్తమం.

English Title
health tips in telugu for kidney

MORE FROM AUTHOR

RELATED ARTICLES