స‌ర్వ‌రోగ నివారిణి ఆ చెట్టు ఆకులు

Submitted by lakshman on Sun, 02/04/2018 - 20:57
health tips

మన పూర్వికులు దేనినైన పూజించండి అని చెప్పారంటే అందులో అందులో ఆధ్యాత్మిక, ఆరోగ్య, వైజ్ఞానిక కారణాలు తప్పకుండా ఉంటాయి. అందులో తులసి మొక్క గురించి ఎంత చెప్పిన తక్కువే. పూర్వ రోజులలో ఒక శాస్త్రం బాగా చెప్పుకునే వారూ… తులసి మొక్క లేని ఇల్లు గుడిలేని ఊరు మన దేశంలో కనిపించవు అని. కారణం అది మనకు ఇచ్చే మంచి ఫలితాలు. అలాగే ఇంకో విషయం కూడా ఇంది. తులసి మొక్క మూలంలో బ్రహ్మ, మధ్యలో విష్ణువు, చివరిలో శంకరుడు ఉంటాడని శాస్త్రాలు చెబుతున్నాయి.
మన హిందూ సాంప్రదాయంలో మూలికల రాణి అంటే తులసిని అభివర్ణిస్తారు. దాదాపు 5వేల సంవత్సరాల క్రితమే అనారోగ్య సమస్యలకు తులసిని చక్కటి దివ్య ఔషదంగా ఉపయోగించారు. అలాంటి తులసిని రకరకాల మందుల తయారీల్లో ఉపయోగించి రోగాలను తరిమికొడుతున్నారు. మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నా రోజుకు ఓ రెండు తులసి ఆకుల్ని నమిలితే అనారోగ్య సమస్యలు రావు. వచ్చినా వాటిని నిలువరించే శక్తి ఈ తులసి ఆకులకి ఉంటుంది. అందుకే తులసి మొక్కకు అంత ప్రాముఖ్యత ఉంది.

అలాగే వాతావరణ మార్పుల వచ్చే వ్యాధులు కానీ, దగ్గు, శ్వాసకోశ సంబంధమైన సమస్యల్ని దూరం చేయాలంటే తులసి అకుల్ని తినాలి. తద్వారా ఆకుల్లో ఉన్న ఔషద లక్షణాలు జ్వరము, తుమ్ములు, వైరల్ నుంచి విముక్తి పొందొచ్చు. అంతేకాదు తులసిలో కొంచెం నిమ్మరసం కలిపితీసుకుంటే కిడ్నీల్ని శుభ్రం చేయడమే కాదు రాళ్లను కూడా కరిగిస్తుంది. ఒత్తిడి వల్ల యవ్వనం లో ఉన్నవారు హార్ట్ అటాక్ వల్ల మరణించేవారు చాలా మంది ఉన్నారు. అయితే తులసి ఆకుల్ని తినడం వల్ల గుండె సంబంధించిన అన్నీ రాకల సమస్యల్ని దూరం చేస్తుంది.  గొంతులో గరగర లు కానీ, గాలి బుడగల్లా ఉండే దద్దల నుంచి సంరక్షించుకోవాలంటే తులసి ఆకుల్ని తినాలి. అలా తింటే జలుబు, విరేచనాలు, మరియు వాంతులు వంటి సాధారణ సమస్యల నుంచి విముక్తినిస్తుంది.

English Title
health tips in telugu

MORE FROM AUTHOR

RELATED ARTICLES