సెల్‌ఫోన్‌తో ఎక్కువసేపు గ‌డిపితే డేంజ‌ర్ జోన్ లో ప‌డ్డ‌ట్లే

Submitted by lakshman on Wed, 04/11/2018 - 06:13
Health risks associated with mobile phones use

సెల్‌ఫోన్‌తో ఎక్కువ సేపు గడపడం, మాట్లాడటం ఆరోగ్యానికి ప్రమాదకరమనే సంగతి తెలిసిందే. అయితే, ఈ విషయాన్ని లైట్‌గా తీసుకుంటే అనారోగ్యాన్ని కొనితెచ్చుకున్నట్లేనని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. మొబైల్ వల్ల కలిగే అనార్థలపై మరింత లోతైన అధ్యయనం జరిపిన పరిశోధకలు పలు ఆందోళనకర విషయాలను వెల్లడించారు. ‘కరెంట్ సైన్స్’ పత్రికలో ప్రచురితమైన యూనివర్శిటీ కాలేజ్(తిరువనంతపురం), జువాలజీ విభాగం అధ్యయనం వివరాలు ఇలా ఉన్నాయి.
సెల్‌ఫోన్ లేదా మొబైల్ నుంచి వెలువడే రేడియేషన్ వల్ల కలిగే అనార్థాలను తెలుసుకునేందుకు 15 ఆరోగ్యకరమైన బొద్దింకలపై పరిశోధనలు జరిపారు. వాటిని వేర్వేరు ప్లాస్టిక్ కంటైనర్లలో పెట్టి, దాదాపు ఒక నిమిషం పాటు కాల్స్ ఆన్ చేసిన మొబైల్‌ను వాటి వద్ద ఉంచారు. ఈ సందర్భంగా వాటి ప్రోటీన్లు, శరీరంపై మార్పులు, గుర్తించారు. నాడీ కేంద్రంలోని అసిటికోలిన్ రసాయనంలో స్వల్ప పెరుగుదల కనిపించింది. మూడు గంటల తర్వాత బొద్దింకల్లోని అవయవాలు క్రమేనా మందగించడం మొదలైందని పరిశోధకులు వివరించారు.

మొబైల్ రేడియేషన్ల వల్ల బొద్దింకల్లోని న్యూరోట్రాన్స్మిటర్లు క్షీణించినట్లు తెలుసుకున్నారు. ఈ న్యూరోట్రాన్స్మిటర్లు మానవ శరీరంలో కూడా ఉంటాయి. మానవ మెదడులో 10 బిలియన్ల న్యూరాన్లు (మెదడు కణాలు) ఉంటాయి. ప్రతి ఒక్క కణం, మిగతా కణాలతో రసాయనికంగా అనుసంధానించబడి ఒకదానితో ఒకటి సందేశాలను మార్చుకొంటూ ఉంటాయి. ఈ అనుసంధానకాలను న్యూరోట్రాన్స్‌మిటర్లు లేదా రసాయనిక ప్రసారకాలు (Neurotransmeter or Chemical messengers) అంటారు.

మన ఆవేశ అనుభూతులను న్యూరోట్రాన్స్‌మిటర్‌లు అదుపుచేస్తాయి. ఇవిగానీ క్షిణిస్తే మనిషిలో డిప్రషన్, మతిమరపు తదితర రుగ్మతలకు గురయ్యే ప్రమాదం ఉంది. మొబైల్ నుంచి వెలువడే EMR (ఎలక్ట్రో మెగ్నాటిక్ రేడియేషన్) శరీరంలోని భౌతిక మరియు జీవరసాయన క్రియలపై కూడా ప్రభావం చూపుతున్నట్లు కనుగొన్నారు. ఈ నేపథ్యంలో మొబైల్‌లో ఉండే తక్కువ స్థాయి రేడియో ఫ్రిక్వెన్సీ, మైక్రోవేవ్‌ రేడియేషన్‌‌‌కు గురైతే ఆరోగ్య సమస్యలు తప్పవని హెచ్చరించారు. ముఖ్యంగా మెదడు సంబంధిత వ్యాధులు ఏర్పడే ప్రమాదం ఉందని తెలిపారు.
కాబట్టి, మొబైల్ ఫోన్లకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ముఖ్యంగా గంటల తరబడి ఫోన్లలో మాట్లాడే అలవాటును తగ్గించుకోవడం ఉత్తమం. చిన్నారులపై బాల్యం నుంచే మొబైల్ ప్రభావం పడితే.. భవిష్యత్తులో మానసిక, శరీరక రుగ్మతలకు గురయ్యే ప్రమాదం కూడా ఉంది. తస్మత్ జాగ్రత్త!!
 

English Title
Health risks associated with mobile phones use

MORE FROM AUTHOR

RELATED ARTICLES