వేస‌విలో హుషారెత్తించే స‌బ్జా గింజ‌లు

Submitted by lakshman on Thu, 03/29/2018 - 03:06
Health benefits Of Sabja Seeds

సబ్జా గింజలలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. సబ్జా గింజలు శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తాయి. వేసవిలో చెమటకాయలు రాకుండా కాపాడుతాయి. చికెన్ ఫాక్స్ వచ్చిన వారికి శరీర తాపం అధికంగా ఉంటుంది. పొక్కులు వల్ల మంట అధికంగా ఉంటుంది. అలాంటప్పుడు సబ్జా గింజలు నీళ్ళలో నానబెట్టి కొబ్బరి నీళ్ళలో కలిపి తాగిస్తే సత్వర ఫలితం ఉంటుంది. అజీర్తి చేసిన వారికి ఈ గింజలను నానబెట్టిన నీటిలో చెంచా నిమ్మరసం వేసి పంచదార కలిపి  తాగిస్తే ఫలితం ఉంటుది. బ్యాక్టీరియా సంబంధిత సమస్యలను నివారిస్తుంది. ఈ నీటిని రాత్రిపూట తాగడం వల్ల మరునాటికి శరీరంలో పేరుకున్న వ్యర్థాలు తొలగిపోతాయి. సబ్జా గింజలను నీటిలో నానబెట్టి తాగడం వల్ల శరీర జీవ క్రియల పనితీరు మెరుగుపడుతుంది.
 
1. ఒక గ్లాసు నీటిలో రెండు చెంచాల సబ్జా గింజలు నానబెట్టి రోజుకు మూడు లేదా నాలుగుసార్లు తీసుకోవడం వల్ల మహిళలు బరువు తగ్గుతారు. అయితే వీటిని నిద్రపోయే ముందు ఒక గ్లాసు తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
 
2. ఇందులో మహిళలకు అవసరమైన ఫోలెట్, నియాసిన్ ఇంకా చర్మాన్ని అందంగా ఉంచే విటమిన్ ఇ లభించడంతో బాటు శరీరంలో పేరుకున్న వ్యర్థాలను తొలగించడంలో కూడా ఇవి తోడ్పడతాయని ఆరోగ్యనిపుణులు అంటున్నారు.
 
3. అంతేకాదు వీటిని పైనాపిల్, ఆపిల్, ద్రాక్షా రసాలలో కలిపి పిల్లలకు తాగిస్తే వడదెబ్బ నుండి కాపాడుకోవచ్చు. వీటిని ధనియాల రసంతో కలిపి ఇస్తే జ్వరం తగ్గుముఖం పడుతుంది.
 
4. సబ్జా గింజలు వాంతులను తగ్గించి అజీర్తిని తొలగిస్తాయి. హానికరమైన టాక్సిన్లను పొట్టలోనికి చేరకుండా చేస్తాయి. గొంతు మంట, దగ్గు, ఆస్తమా, జ్వరం తగ్గించేందుకు ఇవి బాగా పనిచేస్తాయి.

English Title
Health benefits Of Sabja Seeds

MORE FROM AUTHOR

RELATED ARTICLES