చూడ‌ప్పా సిద్ధ‌ప్పా..ఈ కార్పొరేట‌ర్ స్టైలే వేర‌ప్పా

Submitted by lakshman on Sun, 01/21/2018 - 17:39
 hayathnagar corporator sama tirumala reddy


హైదరాబాద్ హయత్‌నగర్ కార్పొరేటర్ సామా తిరుమల్ రెడ్డి  అంటే హ‌డ‌లెత్తుతున్నారు. ముఖ్యంగా మ‌ల విస‌ర్జ‌న చేసేవారు. పొద‌ల్లో మూత్ర విస‌ర్జ‌న చేసే వారు. ఎందుకంటే ఆయ‌న స్వచ్ఛభారత్, ‘మార్పు కొరకు వినూత్న నిరసన’ పేరుతో  సెల్ఫీ క్యాంపెయిన్ నిర్వ‌హిస్తున్నారు. ఆ కాంపెయిన్ పై వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతున్నా తిరుమ‌ల్ రెడ్డి మాత్రం నేను ఒక్క‌ సెల్ఫీ తీస్తే వంద‌సెల్ఫీలు తీసిన‌ట్లే హ హ అంటూ సినిమా డైలాగ్ లు కొడుతున్నారు. ఇదంతా ఎందుకంటే కేంద్ర‌ప్ర‌భ్వుతం వేల‌కోట్లు ఖ‌ర్చుపెట్టి స్వ‌చ్చ భార‌త్ అంటుంటే మీరు మాత్రం బ‌హిరంగంగా మ‌ల విస‌ర్జ‌న చేయడం ఏంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. 
తాజాగా పాల్వంచకు చెందిన రాంబా ప‌నిచేసుకుందామ‌ని ప‌ల్లెటూరు నుంచి సిటీ కొచ్చాడు. అస‌లే సిటీకి కొత్త. మూత్ర విస‌ర్జ‌న చేయాలి. పాపం ఏం చేస్తాడు ఆ వ్య‌క్తి. డ‌బ్బా తీసుకొని పొద‌ల్లోకి వెళ్లాడు. అంతే అత‌న్ని చూసిన  తిరుమల్ రెడ్డి అదేపనిగా అక్కడికి వెళ్లారు. రాంబాబు కనిపించేలా సెల్ఫీదిగారు. అతనితో గుంజీలు తీయించి, స్వచ్ఛభారత్ ప్రమాణం చేయించారు. ఇదంతా ‘విధిలేని పరిస్థితుల్లో దిగిన సెల్ఫీ’ అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఈ పోస్టుపై సోష‌ల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. స్వ‌చ్ఛ భార‌త్ అంటూ వేల‌కోట్లు ప్ర‌భుత్వాలు ఖ‌ర్చుపెడుతున్నా అవి ప‌క్క‌దారి ప‌డ‌తున్నాయ‌ని స్వయంగా ప్రభుత్వ ఆడిట్ లెక్కలే చెబుతున్నాయంటున్నారు. తింటానికే తిండిలేక నానా అవ‌స్థ‌లు ప‌డుతుంటే. వేల‌కు వేలు అయ్యే మ‌రుగు దొడ్లు ఎలా నిర్మించుకోవాలి అన్ని ప్ర‌శ్నిస్తున్నారు. అలా గ‌త్యంత‌రం లేని  పరిస్థితిలో పొదల్లోకి వెళితే  పబ్లిసిటీ యావ తప్ప మరొకటి కనిపించడం లేదని అంటున్నారు.
మ‌రికొంద‌రు తిరుమల్ రెడ్డి స్వచ్ఛ భారత్ కోసం అకుంఠిత దీక్షతో పనిచేస్తున్నారని, అంతుకు ప్రశంసిస్తామని, అయితే ఆయన పొదల్లోకి వెళ్లి మరీ ఇలాంటి సెల్ఫీలు తీసుకోవాల్సిన అవసరం లేదని సూచిస్తున్నారు. 

English Title
hayathnagar corporator sama tirumala reddy selfie campaign

MORE FROM AUTHOR

RELATED ARTICLES