కొబ్బరి నూనెపై హార్వర్డ్ బాంబ్...గుబులు రేపుతున్న నివేదిక

కొబ్బరి నూనెపై హార్వర్డ్ బాంబ్...గుబులు రేపుతున్న నివేదిక
x
Highlights

కోటి లాభాలు అని కొందరు అంటున్నారు కోటి నష్టాలని మరి కొందరు అంటున్నారు ఇంతకీ దేని కారణంగా కోటి లాభాలు దేని ఫలితంగా కోటి నష్టాలు తెలుసుకోవాలంటే ఈ స్టోరీ...

కోటి లాభాలు అని కొందరు అంటున్నారు కోటి నష్టాలని మరి కొందరు అంటున్నారు ఇంతకీ దేని కారణంగా కోటి లాభాలు దేని ఫలితంగా కోటి నష్టాలు తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవండి.

ప్రస్తుతం కొవ్వు కరిగించుకునేందుకు ఎక్కువగా వినిపిస్తున్న మాట కొబ్బరినూనె. దీంతో అధిక బరువు తగ్గుతుందని మధుమేహం మాయమవుతుందని థైరాయిడ్ సమస్య పోతుందని చెబుతున్నారు. అయితే హార్వర్డ్ టి.హెచ్.లో ప్రొఫెసర్ మాత్రం కోకోనెట్ ఆయిల్ స్వచ్ఛమైన విషం అంటున్నారు కొబ్బరి నూనె వాడితే కోటి లాభాలు కాదు కోటి నష్టాలు వాటిల్లుతాయంటున్నారు.

హార్వర్డ్ టిహెచ్‌లో ప్రొఫెసర్ కరీన్ మిచెల్స్ చెప్పిన దాని ప్రకారం కొబ్బరి నూనె స్వచ్ఛమైన విషం అంటూ పెద్ద బాంబు పేల్చారు. మనిషి తినగలిగే అత్యంత చెత్త తిండి కొబ్బరి నూనె అని ఆమె అభిప్రాయ పడ్డారు కొబ్బరినూనె‌కు కొందరు వ్యక్తులు దీనికి అధిక ప్రాధాన్యత ఇచ్చి కొవ్వును తగ్గించే సంజీవనిగా ప్రచారం చేస్తున్నారని ఆమె తెలిపారు అయితే కొబ్బరినూనెలో కొన్ని రకాల కొవ్వు ఆమ్లాలు శరీరానికి మంచిది కాదని అవి స్వచ్ఛమైన విషం అని చెబుతున్నారు. దీనిపై పరిశోదనలు జరుగుతున్నాయని ఆమె తెలిపారు.

అయితే ప్రస్తుతం కొబ్బరినూనెతో కోటి లాభాలు అంటూ ప్రచారం జరుగుతోంది శరీరంలో కొవ్వు కరుగుతుందని, మెదడు ఆరోగ్యంగా పనిచేస్తుందని చెబుతున్నారు దీంతో ఎక్కువ మంది కొబ్బరినూనెను వాడుతున్నారు అయితే ఇలాంటి సమయంలో దీనికి విరుద్ధంగా కొబ్బరినూనె వాడటం కన్నా విషం తాగడం మంచిదంటూ వార్తలు రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కోకోనట్ ఆయిల్ ను స్వచ్చమైన విషం అంటూ చెప్పిన వార్తలు వైరల్ అవుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories