కొంప ముంచిన కరక్కాయ!

కొంప ముంచిన కరక్కాయ!
x
Highlights

కరక్కాయ పొడి వ్యాపారం పేరుతో మోసపోయిన బాధితులు ఎస్‌ఐఎంటీ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. కొంతమంది కేటుగాళ్లు ప్రజలను నిలువు దోపిడీ చేశారు. ఈ సంస్థలో...

కరక్కాయ పొడి వ్యాపారం పేరుతో మోసపోయిన బాధితులు ఎస్‌ఐఎంటీ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. కొంతమంది కేటుగాళ్లు ప్రజలను నిలువు దోపిడీ చేశారు. ఈ సంస్థలో ఎక్కువగా మహిళలే పెట్టుబడులు పెట్టారు. వారంతా పొదుపు సంఘంలో జమ చేసిన డబ్బులను కరక్కాయ పొడి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి మోసపోయి లబోదిబోమంటున్నారు. ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు ఐదుగురు మహిళలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే అరెస్టైన మహిళలు తామూ బాధితులమేనని చెబుతుండటంతో ఈ కేసులో మరో ట్విస్ట్.

కరక్కాయ పొడి వ్యాపారం పేరుతో మోసపోయిన బాధితులు క్రమంగా పెరుగుతున్నారు. బాధితుల్లో ఎక్కువ మంది మహిళలే ఉన్నారు. హైదరాబాద్, తూర్పుగోదావరి జిల్లాతోపాటు వరంగల్ జిల్లాకు చెందిన వాళ్లు ఉన్నారు. వీళ్లలో కొంత మంది పొదుపు సంఘంలో జమ చేసిన డబ్బులను ఎస్‌ఐఎంటీ సంస్థలో పెట్టుబడి పెట్టారు. ఇప్పుడు ఈ స్కాం బయటపడటంతో లబోదిబోమంటున్నారు.

కిలో కరక్కాయలు వంద రూపాయలని, అదే కిలో కరక్కాయల పొడి తీసుకుంటే 150 రూపాయలని, కానీ, వెయ్యి రూపాయలు డిపాజిట్ చేస్తే కిలో కరక్కాయలు ఇస్తామన్నారని, వాటిని పొడి చేసి ఆ పొడిని జాగ్రత్తగా తీసుకొస్తే డిపాజిట్ చేసిన సొమ్ముకు అదనంగా 300 కలిపి మొత్తం 1300 ఇస్తామని ఆశ చూపించారని బాధితులు చెబుతున్నారు. దీంతో 10వేలు పెట్టి 10 కిలోల కరక్కాయలు తీసుకున్నామని, దానికి వారు 3వేల రూపాయల చొప్పున ఇచ్చినట్టు తెలిపారు. యూట్యూబ్ లో వచ్చిన ప్రకటన చూసి వచ్చి డబ్బులు కట్టి మోసపోయామని ఓ రోజూకూలీ ఆవేదన వ్యక్తం చేసింది.

రెండోసారి 15వేల పెట్టుబడి పెట్టామని, అప్పుడు కూడా డబ్బులు ఇచ్చారని, మళ్లీ ఎక్కువ డబ్బులు కట్టామని, దాంతో వారు కిలోకు 25 పెంచినట్టు చెప్పారని, దాంతో ఓ మహిళ 70వేలు పెట్టినట్టు తెలిపారు. ఈ విధంగా వేల రూపాయలు పెట్టుబడిగా పెట్టి మోసపోయినట్టు మహిళలు తెలిపారు. మొదట్లో బాగుందని, దీంతో డబ్బులు ఎక్కువ వస్తాయని ఆశపడి పెట్టుబడులు పెట్టినట్టు వారు తెలిపారు.

అయితే, ఇందులో 10వేల నుంచి లక్షల్లో పెట్టుబడులు పెట్టిన మహిళలు ఉన్నారు. ఇప్పుడు సంస్థ మూతపడిందన్న విషయం తెలుసుకున్న బాధితులు ఎస్‌ఐఎంటీ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. బాధితులు . ఈ కేసులో ఇప్పటికే ఐదుగురు మహిళా సిబ్బందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పరారీలో ఉన్న సంస్థ యాజమానుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే, అయితే, తాము కూడా డబ్బులు పెట్టుబడి పెట్టి మోసపోయినట్టు అక్కడి సిబ్బంది చెబుతున్నారు. మరి ఈ కరక్కాయ స్కాంలో ఇంకెంత మంది బాధితులు బయటకొస్తారో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories