విపక్షాలకు అస్త్రాలుగా మారిన హరీశ్ వ్యాఖ్యలు

Submitted by arun on Sat, 09/22/2018 - 17:06

నిన్న ఇబ్రహీంపూర్‌ సభలో పాల్గొన్న హరీష్‌రావు  ప్రజల ఆదరణ ఉన్నప్పుడే రాజకీయాల్లో నుంచి వైదొలగాలని అన్నారు. ఇప్పుడా వ్యాఖ్యలు విపక్షాలకు అస్త్రాలుగా మారాయి. హరీష్‌ వ్యాఖ్యలను తమకు అనుకూలంగా మార్చుకుంటూ టీఆర్ఎస్‌పై దాడి చేస్తున్నాయి. హరీష్‌ వాఖ్యలతో టీఆర్ఎస్‌లో ఇంటిపోరు మొదలైందంటూ రఘునందన్‌రావు లాంటి వారు వ్యాఖ్యానిస్తున్నారు. ముందస్తు ఎన్నికల ప్రచారంలో భాగంగా నిన్న ఇబ్రహీంపూర్‌లో మాట్లాడిన హరీష్‌రావు స్ధానికుల స్పందన చూసి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఇలాంటి ఆప్యాయత, అనురాగాల మధ్యే రాజకీయాల నుంచి తప్పుకోవాలని ఉందంటూ వ్యా‌ఖ్యానించారు. దీనిపై విమర్శలకు దిగిన ప్రతిపక్షాలు హరీష్‌రావుకు పొమ్మనలేక పొగబెడుతున్నారంటూ ఆరోపిస్తున్నారు. 
 

English Title
harish rao words heat in politics

MORE FROM AUTHOR

RELATED ARTICLES