రాబోయే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ సత్తాచాటుతుంది

Submitted by chandram on Fri, 11/09/2018 - 16:42
Harish Rao

కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గజ్వేల్ నియోజకవర్గం నుండి ల‍క్ష ఓట్ల మెజరిటీతో గెవడం ఖాయమని ఆపద్దర్మ మంత్రి హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు.కంటివెలుగుతో పేదల పెన్నిదిగా ఉన్న కెసిఆర్ కు ఓటువేసి గెలిపించాలన్నారు. తూప్రాన్ ను మున్సిపాలిటీగా, రీజీనల్ రింగ్ రోడ్డుతో అభివృద్ది పదంలో దూసుకపోతుందని తెలిపారు. రూ. 6కోట్లతో గజ్వేల్ లో కెసిఆర్ అభివృద్ధి పనులు చేపట్టారన్నారు గజ్వేల్ ప్రచారంలో హరీశ్ రావు అన్నారు. కెసిఆర్ కు తిరుగులేదని ఇండియా టుడే సర్వేలో 75శాతంతో మళ్లీ కెసిఆరే ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు చేపడుతరని సర్వే వెల్లడించిన విషయం గుర్తుచేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయఢంకా మోగించి తిరిగి టీఆర్‌ఎస్‌ అధికార పగ్గాలు చేపడతుందని హారీష్‌ రావు విశ్వాసం వ్యక్తం చేశారు.టికెట్ల కోసం దిల్లీ చుట్లు తిరుగుతున్నారని విపక్షాలుపై హరీశ్ రావు వ్యగ్రాస్తం విసిరారు. విపక్షాలు దిల్లీ, అమరావతికి పోతుంటే తెలంగాణ ప్రజలు మాత్రం టీఆర్ఎస్ వైపే ఉన్నారని చంద్రబాబుతో ఒరిగేదేమి లేదని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ సత్తా చాటి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు.
 

English Title
harish rao says up coming government definitely comes trs only

MORE FROM AUTHOR

RELATED ARTICLES