గుజరాత్ కోర్టు సంచలన తీర్పు...హార్దిక్ పటేల్ కు రెండేళ్ల జైలుశిక్ష!

Submitted by arun on Wed, 07/25/2018 - 14:20
Hardik Patel

పటీదార్ ఉద్యమనేత హార్దిక్ పటేల్‌కు రెండేళ్లపాటు జైలు శిక్ష విధిస్తూ గుజరాత్‌లోని స్థానిక కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2015లో పటేల్ వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ, పటీదార్ సామాజిక వర్గం తీవ్ర స్థాయిలో నిరసనలు చేపట్టి, ప్రభుత్వ ఆస్తులకు భారీగా నష్టం కలిగించిన కేసులో హార్దిక్ ను కోర్టు దోషిగా తేల్చింది. యువతను ఆయనే విధ్వంసానికి రెచ్చగొట్టారంటూ పోలీసులు సమర్పించిన వీడియో సాక్ష్యాలను, పత్రికల్లో వచ్చిన వార్తలు, వాట్స్ యాప్ గ్రూపుల్లో వైరల్ అయిన పోస్టులు, ఆపై విచారణ సందర్భంగా వెల్లడైన వాస్తవాలను పోలీసులు కోర్టు ముందుంచారు. ఈ కేసులో విచారణ దాదాపు రెండున్నరేళ్లు సాగగా, హార్దిక్ ను దోషిగా తేలుస్తూ రెండు సంవత్సరాల జైలు శిక్షను విధిస్తున్నామని, ఆయన పైకోర్టుకు అపీల్ చేసుకోవచ్చని సెషన్స్ కోర్టు న్యాయమూర్తి వెల్లడించారు.

English Title
Hardik Patel Gets 2 Years In Jail In 2015 Rioting Case In Gujarat

MORE FROM AUTHOR

RELATED ARTICLES