అమెరికాను వణికించిన 9/11దాడుల లీడ్ హైజాకర్ కుమార్తెతో.. బిన్ లాడెన్ కొడుకు పెళ్లి..!      

Submitted by arun on Mon, 08/06/2018 - 16:31
Hamza bin Laden

సెప్టెంబరు 9న 2001లో జరిగిన ఉగ్రవాద దాడులు అమెరికానే, కాదు ప్రపంచం మొత్తాన్ని గడగడలాడించాయి. అగ్రరాజ్యం ఈ ఘటనతో ఒక్కసారిగా వణికిపోయింది. ఒసామా బిన్ లాడెన్ సారధ్యంలో జరిగిన దాడిలో అమెరికా ట్రేడ్ టవర్స్ కూలిపోయి వందలామది ప్రాణాలు కోల్పాయారు. అనంతరం అమెరికా దళాలు అందుకు కారణమైన ఒసామా బిన్ లాడెన్ మట్టుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మరో వార్త సంచలనంగా మారింది. ఒసామా బిన్ లాడెను కుమారుడు హంజా బిన్ వివాహం చేసుకున్నాడు. అది మరెవరితోనే కాదు... 9/11 ఉగ్రవాద దాడుల లీడ్ హైజాకర్ మహ్మద్ అట్టా కుమార్తె.

ఈ విషయాన్ని ‘ది గార్డియన్’ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో లాడెన్ కుటుంబసభ్యులు తెలిపారు. ముఖ్యంగా తండ్రి మరణానికి హంజా ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమవుతున్నట్లు సంచలన వ్యాఖ్యాలు చేశారు. అయితే అతనితో తమకు ఎటువంటి సంబంధాలు లేవని తెలపడం కొసమెరుపు. ఆల్ ఖైదా ద్వారా ప్రతీకార దాడులకు తెగబడవద్దని తాము హంజాను కోరినట్లు తెలిపారు.  అయితే హంజా ఆచూకీని తెలుసుకునేందుకు యూఎస్, బ్రిటన్ తదితర దేశాల నిఘా సంస్థలు రెండేళ్లుగా జల్లెడపడుతున్నాయి. ఆఫ్గనిస్థాన్ లో నివాసం ఉన్నట్లు అనుమానిస్తున్న హంజాను.. అమెరికా ప్రపంచ ఉగ్రవాదిగా ప్రకటించి ఉంది.
 

English Title
Hamza bin Laden has married daughter of lead 9/11 hijacker, say family

MORE FROM AUTHOR

RELATED ARTICLES