బ్యాడ్ న్యూస్ : సగం ఏటీఎంలు మూసివేత.. కారణం ఏంటంటే..

బ్యాడ్ న్యూస్ : సగం ఏటీఎంలు మూసివేత.. కారణం ఏంటంటే..
x
Highlights

అసలే అరకొర ఏటీఎంలు, అందునా నగదు కొరత ఎదుర్కుంటున్న ప్రజలకు పెద్ద ఎదురుదెబ్బ తగలనుంది. వచ్చే ఏడాది మర్చినాటికల్లా సగం ఏటీఎంలు మూసివేయాలని ఏటీఎంల...

అసలే అరకొర ఏటీఎంలు, అందునా నగదు కొరత ఎదుర్కుంటున్న ప్రజలకు పెద్ద ఎదురుదెబ్బ తగలనుంది. వచ్చే ఏడాది మర్చినాటికల్లా సగం ఏటీఎంలు మూసివేయాలని ఏటీఎంల సమాఖ్య భావిస్తోంది. హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌లో వచ్చిన నవీకరణలు, క్యాష్‌ మేనేజ్‌మెంట్ స్టాండర్డ్స్‌, క్యాష్‌ను లోడ్ చేయడం వంటి విధానాల్లో వచ్చిన మార్పుల కారణంగా ఏటీఎంలను నిర్వహించడం తలకు మించిన భారంగా ఉంటుందని ఏటీఎంల సమాఖ్య ఓ ప్రకటనలో వెల్లడించింది.అలాగే ఏటీఎంల నిర్వహణకు వివిధ బ్యాంకులనుంచి 3వేల కోట్ల అదనపు భారం పడతుందని అంచనా వేసింది. దీంతో ప్రస్తుతం అందుబాటులో ఉన్న 2 లక్ష 38 వేల ఏటీఎంలలో సగం 2019 మార్చికల్లా మూసివేసే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఇదే జరిగితే వేలాది మంది ఉద్యోగాలు కోల్పోవడంతోపాటు, అనేక రంగాలపై ప్రభావం పడనుందని
ఏటీఎంల సమాఖ్య తెలిపింది. ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లోని ఏటీఎంలు ఎక్కువ మూసివేతకు గురవుతాయని తెలిపింది. ప్రభుత్వం అందించే సబ్సిడీల సొమ్మును ఏటీఎం నుంచి పొందడం ఇకనుంచి ప్రజలకు కష్టంగా మారనుందని తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories