అమెరికన్ కాంగ్రెస్‌లో H-4 ఎంప్లాయిమెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ బిల్లు

Submitted by nanireddy on Sun, 11/18/2018 - 08:10
H4-visa-issue-Bill-in-US-Congress-to-protect-H1B-spouses

కొద్దిరోజులక్రితం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H-4 వీసాపై ఉన్న పని అనుమతిని తొలగించనున్నట్లుగా జీవో జారీ చేశారు.. అయితే  H-4 వీసాదారులను కాపాడాలంటూ ఇద్దరు సెనేట్సభ్యులు అమెరికన్ కాంగ్రెస్ లో బిల్లు ప్రవేశపెట్టారు. H-4 వీసా పొందినవారికి అమెరికాలో పనిచేసే అనుమతి లభిస్తోంది. H1b వీసాదారుల జీవిత భాగస్వామికి అమెరికాలో H-4 వీసాలను ఇస్తున్నారు. ఈ క్రమంలో పని అనుమతి తీసివేయడం వల్ల వారి కుటుంబాలు విడిపోయే ప్రమాదం ఉంది. అలాగే వేలాదిమంది ప్రతిభావంతులు అమెరికాను విడిచివెళ్లే అవకాశం ఉందని శాసనకర్తలు అన్నాజీ ఎషో, జోయ్ లాఫ్ గ్రెన్ లు ఈ బిల్లులో పేర్కొన్నారు. కాగా H-4 వీసా రద్దుప్రభావం ముమ్మాటికీ వలసదారులపై పడుతుందని వారు అమెరికన్ కాంగ్రెస్ లో H-4 ఎంప్లాయిమెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ బిల్లును ప్రవేశపెట్టారు.

English Title
H4-visa-issue-Bill-in-US-Congress-to-protect-H1B-spouses

MORE FROM AUTHOR

RELATED ARTICLES