గోవిందప్ప స్వామి ఆశ్రమంలో చీకటి కార్యకలాపాలు...hmtv చేతిలో బాబా బండారం

Submitted by arun on Sat, 10/06/2018 - 14:37

అనంతపురం జిల్లాలో ప్రబోధానంద స్వామి గొడవ చల్లారకముందే మరో బాబా బూతు పురాణం వెలుగులోకి వచ్చింది. భక్తి పేరిట మహిళలను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు. వజ్రకరూరు మండలం కొనకొండలోని  గోవిందప్ప స్వామి ఆశ్రమం అధిపతిగా గురునాథ స్వామి ఉన్నాడు. ఓ యువతితో గురునాథ స్వామి అసభ్యంగా మాట్లాడాడు. ఈ విష‍యం బయటపడడంతో తప్పు చేశాను మన్నించు అంటూ వేడుకున్నాడు. ఆ యువతితో గురునాథ స్వామి మాట్లాడిన ఫోన్ సంభాషణ హెచ్ ఎం టీవీ చేతికి చిక్కింది. 

కొనకొండలోని  గోవిందప్ప స్వామి ఆశ్రమం అధిపతిగా  గురునాథ స్వామి కొనసాగుతున్నారు. ఆయనకు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడులో భక్తులు ఉన్నారు. ప్రతి అమావాష్యకు పెద్ద ఎత్తున ఆశ్రమానికి భక్తులు వస్తుంటారు. అర్ధరాత్రి దాకా భజనలు, జ్జాన బోధ జరుగుతుంది. కొద్ది రోజుల క్రితం ఆశ్రమానికి వచ్చిన హిందూపురం సమీపంలోని ఓ గ్రామానికి చెందిన యువతిని గురునాథ స్వామి వేధించాడు. ఫోన్ లో ఆమెతో అసభ్యంగా మాట్లాడాడు.  గురునాథ స్వామి మాటలను రికార్డు చేసిన యువతి నీ బండారం బయటపెడతానని స్వామిజీని బెదిరించింది. తాను తప్పు చేశానని నీవు నా కళ్లు తెరిపించావు, మరో సారి తప్పు చేయనని పదే పదే వేడుకున్నాడు గురునాథస్వామి. ఈ ఫోన్ సంభాషణ హెచ్ ఎం టీవీకి లభించింది. 

గురునాథ స్వామి ఆడియో టేపు బయటికి రావడంతో హెచ్ ఎంటీవీ కొనకొండ్లలోని ఆయన ఆశ్రమానికి వెళ్లింది. స్వామిని కలిసే ప్రయత్నం చేయగా ఆయన అందుబాటులో లేరు. అక్కడి వారిని విచారించగా స్వామి వచ్చిన తర్వాత మీతో మాట్లాడతారని అప్పుడు రండి అన్నారు. అశ్రమంలో ఎలాంటి వీడియోలు తీయోద్దని వేడుకున్నారు.  

English Title
Gurunath Swamy Audio Tape Leaked

MORE FROM AUTHOR

RELATED ARTICLES