గుంటూరులో టీడీపీ-వైసీపీ సవాళ్లు...ప్రతిసవాళ్లు..వైసీపీ లీడర్‌ హౌస్‌ అరెస్ట్‌..

Submitted by arun on Mon, 01/08/2018 - 11:04

టీడీపీ, వైసీపీ నేతల సవాళ్లు ప్రతి సవాళ్లతో గుంటూరు జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ లీడర్‌ అంబటి రాంబాబు టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నలు రాష్ట్రాభివృద్ధిపై సవాళ్లు విసురుకున్నారు. సత్తెనపల్లి వేదికగా బహిరంగ చర్చకు సిద్ధమవడంతో రాజకీయ వాతావరణం హీటెక్కింది. రాష్ట్రాభివృద్ధిపై బహిరంగ చర్చకు సై అన్న టీడీపీ బుద్ధా వెంకన్న విజయవాడ నుంచి సత్తెనపల్లి బయల్దేరారు. మరోవైపు వైసీపీ లీడర్‌ అంబటి రాంబాబు కూడా సత్తెనపల్లి బయల్దేరడానికి సిద్ధమవడంతో పోలీసులు అతన్ని గుంటూరులో హౌస్‌ అరెస్ట్‌ చేశారు. దాంతో అటు గుంటూరులో ఇటు సత్తెనపల్లిలో టెన్షన్ వాతావరణం ఏర్పడింది.

 సత్తెనపల్లిలో అర్హులకు పెన్షన్లు అందడం లేదన్న వైసీపీ నేత  అంబటి రాంబాబు దాన్ని నిరూపించేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. జన్మభూమి కమిటీలతో నిజమైన లబ్ధిదారులకు అన్యాయం జరుగుతోందన్నారు. తన సవాలును బుద్దా వెంకన్న స్వీకరించారని, దానిపై బహిరంగ చర్చకు సిద్ధమన్నారు. అయితే తనకు సీఆర్‌‌పీసీ 30 కింద పోలీసులు నోటీసులు ఇచ్చారన్న అంబటి ఇంటి నుంచి బయటికి వస్తే అరెస్ట్‌ చేస్తామని చెప్పారంటున్నారు అంబటి రాంబాబు‌.
 

English Title
guntur ambati rambabu house arrest

MORE FROM AUTHOR

RELATED ARTICLES