మోదీకి చుక్కలు చూపిస్తామన్నవాళ్లే..దిక్కులు చూస్తున్నారు

మోదీకి చుక్కలు చూపిస్తామన్నవాళ్లే..దిక్కులు చూస్తున్నారు
x
Highlights

గుజరాత్ లో ఈసారి అనూహ్యంగా ముగ్గురు యువ నేతలు ఎన్నికల తెరపైకి వచ్చారు..తమ కులాలకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలంటూ పెద్ద పెద్ద ఉద్యమాలు నడిపారు..ఒక...

గుజరాత్ లో ఈసారి అనూహ్యంగా ముగ్గురు యువ నేతలు ఎన్నికల తెరపైకి వచ్చారు..తమ కులాలకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలంటూ పెద్ద పెద్ద ఉద్యమాలు నడిపారు..ఒక దశలో ఎన్నికల ఫలితాలను శాసించే నేతలుగా కనిపించారు.. కానీ అనూహ్యంగా కుప్పకూలిపోయారు..చప్పబడిపోయారు. ఇంతకీ ఎవరా నేతలు? ఎందుకు ఓడి పోయారు.
గుజరాత్ ఎన్నికల బరిలో ఈసారి యువ కెరటం ఎగసి పడింది. తమ కులాలకు తగిన ప్రాతినిధ్యం లేదని.. తాము వెనకబడిపోయామనీ ఉవ్వెత్తున ఉద్యమాలు చేసింది. పటేల్, ఓబిసి, ఎస్టీ ల నేతలు తమను నిర్లక్ష్యం చేస్తే.. తగిన గుణపాఠం చెబుతామనీ హెచ్చరిస్తూ గుజరాత్ ఎన్నికల్లో వీరు కదం తొక్కారు... ఎన్నికలు ఏడాది ముందునుంచే పటేల్ కులస్తులకు రిజర్వేషన్లు కోరుతూ హార్దిక్ పటేల్ పెద్ద ఎత్తున ఉద్యమాలే చేశాడు. గుజరాత్ బిజెపికి ఒక దశలో చుక్కలు చూపించాడు. పాటీదార్లకు రాజ్యంగం ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ పార్టీలపై ఒత్తిడి పెంచాడు.. పటేల్ కులస్తుల ప్రతినిధిగా విస్తృత పర్యటనలు చేసిన హార్దిక్ పటేల్ ను దెబ్బ తీసేందుకు బిెజెపి తెరపైకి వ్యక్తిగత అస్త్రాలను తీసింది. సెక్స్ సిడిలను విడుదల చేసి హార్దిక్ ప్రభంజనానికి అడ్డుకట్ట వేయాలని చూసింది.. అదే దశలో గుజరాత్ లో గెలవాలన్న పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ ఈ వెనుకబడిన వర్గాలతో సంప్రదింపులు జరిపింది. హార్దిక్ పటేల్ కోరినన్ని సీట్లు కేటాయించింది. ఈ ఎస్టీ, ఓబిసి, పటేల్ కులస్తుల ఓట్లను కొల్ల గొట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నించింది. తీవ్రంగా ప్రయత్నించింది.కానీ ఈ ఎన్నికల్లో హార్దిక్ వర్గం పెద్దగా గెలవలేకపోయింది. రాహుల్, పటేల్ కలసి చేసిన ప్రచార ఫలితంగా కాంగ్రెస్ కు 17 సీట్లు అదనంగా వచ్చాయి. మరోవైపు దళితులకు అసలైన ప్రతినిధిని తానేనంటూ జిగ్నేష్ మెవానీ తెరపైకి వచ్చారు.. ఆదివాసీలకు తగినన్ని రిజర్వేషన్లు కావాలంటూ డిమాండ్ చేసిన జిగ్నేష్ మెవానీ అతికష్టం మీద ఈ ఎన్నికను గెలిచారు. ఇక కాంగ్రెస్ లో తన వర్గాన్ని విలీనం చేసిన మరో ఓబిసి నేత అల్పే‌ష్ ఠాకూర్ కాంగ్రెస్ పార్టీ తరపున నిలబడి ఈ ఎన్నికను గెలిచారు.. మొత్తం మీద.. మోడీకి చుక్కలు చూపిస్తాడనుకున్న హార్దిక్ పటేల్ తమ ఓటమికి ఈవిఎంల ట్యాంపరింగే కారణమంటున్నాడు.
పటేల్, ఓబిసి, దళిత ప్రతినిధులుగా ఈ ముగ్గురు యువకులు ఇచ్చిన గట్టి పోటీ ఫలితంగానే బిజెపి పని చావుతప్పి కన్ను లొట్ట పోయినట్లయింది..

Show Full Article
Print Article
Next Story
More Stories