స్ట్రాంగ్‌ రూముల వద్ద కాంగ్రెస్‌ కాపలా

స్ట్రాంగ్‌ రూముల వద్ద కాంగ్రెస్‌ కాపలా
x
Highlights

పోలింగ్‌ ముగిసి- ఈవీఎంలన్నీ స్ట్రాంగ్‌ రూములకు చేరడంతో ఇపుడు అందరి దృష్టీ వాటి భద్రతపైకి మళ్లింది. ఈవీఎంలను ట్యాంపరింగ్‌ చేసే అవకాశాలున్నట్లు...

పోలింగ్‌ ముగిసి- ఈవీఎంలన్నీ స్ట్రాంగ్‌ రూములకు చేరడంతో ఇపుడు అందరి దృష్టీ వాటి భద్రతపైకి మళ్లింది. ఈవీఎంలను ట్యాంపరింగ్‌ చేసే అవకాశాలున్నట్లు అనుమానాలు రావడంతో స్ట్రాంగ్‌ రూముల వద్ద నిరంతర కాపలాకు తమ పార్టీ బృందాలను అనుమతించాలని కాంగ్రెస్ ఎన్నికల కమిషన్‌కు విజ్ఞప్తి చేసింది. సీఈఓ రజత్‌ కుమార్‌ వెంటనే అందుకు అనుమతి ఇచ్చారు. అటు కేంద్ర ఎన్నికల సంఘం కూడా తెలంగాణ సహా అసెంబ్లీ ఎన్నికలు జరిగిన అన్ని రాష్ట్రాలకూ ప్రత్యేక హెచ్చరికలు జారీ చేసింది.


ఈవీఎంలు, వీవీ ప్యాట్‌లను భద్రపర్చిన స్ట్రాంగ్‌ రూముల భద్రత, రక్షణపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రాల సీఈవోలకు ఈసీ ప్రధాన కార్యదర్శి సుమిత్‌ ముఖర్జీ లేఖ రాశారు. కొన్ని స్ట్రాంగ్‌ రూముల దగ్గర సీసీటీవీ కెమెరాలు పనిచేయడం లేదని, అక్కడ మోహరించిన భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉండడం లేదన్న ఆరోపణలు తమ దృష్టికి వచ్చాయని వివరించారు. స్ట్రాంగ్‌ రూముల భద్రతకు సంబంధిత జిల్లా ఎస్పీలు, పోలీసు కమిషనర్లు బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆ లేఖలో స్పష్టం చేశారు.

అన్ని స్ట్రాంగ్‌ రూంల వద్ద అంకితభావం ఉన్న కార్యకర్తలను, అనుయాయులను నిఘా కోసం నియమించాలని, డిసెంబరు 11 సాయంత్రం దాకా వారు విధుల్లో ఉండాలని పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరారు. ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ సమీపంలోని పాల్మాకుల బీసీ గురుకుల కళాశాల వద్ద శనివారం అర్ధరాత్రి కాంగ్రెస్‌ కార్యకర్తలు కాపలాగా ఉన్నారు. కేంద్రం బయట చీకటిగా ఉండడంతో చలి మంటలు వేసుకొని వాటి వెలుతురులో కాపలాగా ఉంటున్నారు. కీసరలో హోలీమేరీ కాలేజీలోని ఈవీఎంల భద్రతను పరిశీలించేందుకు శనివారం అర్ధరాత్రి ఉప్పల్‌ ప్రజాఫ్రంట్‌ అభ్యర్థి వీరేందర్‌ గౌడ్‌ వెళ్లారు.

Show Full Article
Print Article
Next Story
More Stories